ఎం.అశోక్, జిల్లా భూగర్భజల శాఖ అధికారి
వాల్టా చట్టం అమలు చేస్తున్నారా?
సాక్షి: జిల్లాలో ప్రస్తుతం భూగర్భ
జలాల పరిస్థితి ఎలా ఉంది?
అధికారి: ఈ ఏడాది కురవాల్సిన దాని కన్నా 28 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు అంతగా పెరగలేదు. తాజా గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ నెలలో 8.63 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు అక్టోబర్ ముగిసే నాటికి 9.41 మీటర్ల లోతులోకి వెళ్లాయి. అంటే 0.78 మీటర్లు దిగువకు వెళ్లాయి. గతేడాది ఇదే సమయంలో (5.58) పోలిస్తే 3.83 మీటర్లు లోతుకి నీటి మట్టాలు పడిపోయాయి. 2015–16, 2004 కన్నా ముందు కూడా సరైన వర్షాల్లేక ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.
ఏం చేస్తే భూగర్భజలాలను
కాపాడుకోవచ్చు?
భూగర్భ జలాలను పొదుపుగా వాడుకోవడం, వినియోగించిన నీటిని తిరిగి భూమిలోకి ఇంకించడం తప్ప వేరే మార్గాలు లేవు. వచ్చే వర్షాకాలం వరకు ఇదే అనుసరించాలి. ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం మంచిది. ప్రభుత్వ సూచనల ప్రకారం రైతులు రబీలో ఎక్కువ నీటి వినియోగం ఉండే వరి పంట జోలికి వెళ్లకపోవడం చాలా ఉత్తమం. తక్కువ కాలంలో తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు వేయాలి. పల్లెలు, పట్ణణాల్లో ప్రతి ఒక్కరి బాధ్యతగా నీటి వృథాను అరికట్టాలి.
జిల్లాలో బోరు బావులెన్ని? నీళ్లు
తగ్గుతున్న ప్రాంతాలేవీ?
జిల్లాలో 97 శాతం నేల గ్రానైట్‌తో, మిగిలింది బసాల్ట్‌తో నిర్మితమై ఉంది. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 98,504 బోరు బావులు ఉండగా, అనధికారికంగా మరొక 30 వేల వరకు ఉంటాయి. జిల్లాలో మొత్తం 82 ఫీజో మీటర్లు ఉండగా, ప్రతి నెలాఖరులో భూగర్భ జలాల లెక్కలను తీస్తాం. 10 మీటర్ల కన్నా తక్కువ నీటి మట్టాలు 60 శాతం విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. 10 నుంచి 20 మీటర్ల మధ్యలో 40 శాతం విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. నందిపేట్ మండలంలోని వెల్మల్, సిరికొండలోని చీమన్‌పల్లి, డిచ్‌పల్లిలోని యానంపల్లి, మాక్లూర్, భీమ్‌గల్, ముప్కాల్ ప్రాంతాల్లో నీళ్లు వేగంగా తగ్గుతున్నాయి.
పరిశ్రమలకు, షాపింగ్ మాల్స్‌కు
నిబంధనలు పెట్టారా?
అవును. పరిశ్రమలతోపాటు వాటర్ ప్లాంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, పాఠశాలలు, ఆస్పత్రు లు, ఐస్ ఫ్యాక్టరీలు, అపార్ట్‌మెంట్ల నిర్వాహకులు నీటి వినియోగానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో.నం.15 కూడా ఉంది. వెయ్యి లీటర్ల నీటికి ఒక రూపాయి నుంచి నాలుగు రూపాయల వరకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌కు చెల్లించాల్సి ఉంటుంది. వీటిలోనే నీటి వినియోగం ఎక్కువ ఉంటుంది కనుక నియంత్రించడానికి ఈ చర్యలు ఉపయుక్తంగా ఉంటాయి.
అవును. ఎల్‌నినో తీవ్రతను ఎదుర్కోనేందుకు వాల్టా చట్టం (2002)ను పకడ్బందీగా అమలు చేయాలని ఇటీవల ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. అధికారుల అనుమతి లే కుండా వ్యవసాయ, గృహవసర బోర్లు వేయ రాదు. అనుమతి లేకుండా బోర్లు వేస్తే వాహన యజమానికి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా ఉంటుంది. బోరు వేయించుకునే యజమాని ముందుగా సెక్షన్–10 ప్రకారం స్థానిక తహసీల్దార్/మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి. పాత బోర్లకు ఫ్లషింగ్, డీపెనింగ్ చేసుకోవచ్చు. చెట్లు నరకడం, మట్టి, ఇసుక తీయడంపై కూడా వాల్టా చట్ట నిబంధనలు వర్తిస్తాయి.
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దటి నుంచి బయటపడేందుకు నీటి సంరక్షణ చర్యలు అత్యవసరంగా చేపట్టాలని జిల్లా భూగర్భ జల శాఖ అధికారి ఎం.అశోక్ ప్రజలు, రైతులను కోరారు. ఈ ఏడాది సరిపడా వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు పెద్దగా పెరగలేదని, గతేడాదితో పోలిస్తే చాలా లోతులోకి వెళ్లాయని వెల్లడించారు. రైతులు ఆరుతడి పంటలు వేయాలని కోరారు. అనుమతి లేకుండా కొత్త బోర్లు వేయకూడదని, వాల్టా చట్టం అమల్లో ఉందని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. – డొంకేశ్వర్(ఆర్మూర్)
గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాలు చాలా తగ్గాయి
వినియోగించిన నీటిని తిరిగి భూమిలోకి ఇంకించడమే ముందున్న మార్గం
అనుమతి లేకుండా బోరు వేస్తే
వాల్టా చట్టం ప్రకారం చర్యలు
రైతులు వరిని వదులుకొని ఆరుతడి
పంటలే సాగు చేయాలి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా
భూగర్భజల శాఖ అధికారి ఎం. అశోక్


