సాగులో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

సాగులో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యమివ్వాలి

Nov 7 2026 12:30 AM | Updated on Nov 7 2026 12:30 AM

● ఆత్మ జిల్లా ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌

తిరుమల ప్రసాద్‌రావు

● సాలూర మండల కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు

బోధన్‌: అన్నదాతలు సాగులో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యమివ్వాలని ఆత్మ జిల్లా ప్రాజెక్ట్‌ అధికారి తిరుమల ప్రసాద్‌ అన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో సమగ్ర వ్యవసాయ పద్ధతుల పాటించాలని సూచించారు. సాలూర మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శుక్రవారం వ్యవసాయశాఖ, ఆత్మ, రుద్రూర్‌ కృషి విజ్ఞాన కేంద్రం, జగిత్యాల వ్యవసాయ కళాశాల అధ్వర్యంలో పంటల వైవి ద్ధ్యీకరణ, ప్రకృతి వ్యవసాయం, యాసంగీ సీజన్‌ పంట ప్రణాళిక అంశాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి రైతులు అధిక దిగుబడులు సాధించాలన్నారు. సదస్సులో సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులను వివరిస్తూ వివిధ అంశాలపై తయారు చేసిన ప్రాజెక్టులతో స్టాల్స్‌ ఏర్పాటు చేసి ప్రదర్శించారు. ఏడీఏ శ్రీనివాస్‌రావు, రుద్రూర్‌ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఇందూధర్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్‌ అల్లె రమేశ్‌, జగిత్యాల వ్యవసాయ కళాశాల ప్రతినిధులు, విద్యార్థినులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement