పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం మగ్గిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు హిమప్రియ, విజ్ఞాత, ప్రణిత రాష్ట్రస్థాయి అండర్–17 బాలికల వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ మదు తెలిపారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థులు వెళ్లారు. విద్యార్థులను హెచ్ఎం హరిత, పీఈటీ మధు అభినందించారు.
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండలంలోని ధర్మారం (బి) గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని మాదరి పవిత్ర రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ నెల 4నుంచి 6వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ (అండర్–19) బాలికల విభాగం సాఫ్ట్బాల్ పోటీల్లో పవిత్ర జిల్లాజట్టు తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ (బంగారు పతకం) సాధించినట్లు ప్రిన్సిపాల్ మాధవి లత, ఫిజికల్ డైరెక్టర్ నీరజరెడ్డి, పీటీ స్వప్న శుక్రవారం తెలిపారు. ఈసందర్భంగా పవిత్రను ప్రిన్సిపాల్ మాధవిలత, అధ్యాపక బృందం, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.


