చికిత్స పొందుతూ యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ యువకుడి మృతి

Nov 7 2026 12:30 AM | Updated on Nov 7 2026 12:30 AM

ప్రేమించలేదని యువతిపై లైంగిక దాడి

మోపాల్‌: మండలకేంద్రంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని బైరాపూర్‌ జీపీ పరిధిలోగల జైతియా నాయక్‌ తండాకు చెందిన బానోత్‌ మంగులాల్‌ (32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 4న అతడు బైక్‌పై తాడెం గ్రామంవైపు బయలుదేరగా, మోపాల్‌ రైతువేదిక సమీంలో అతడి బైక్‌ను ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో మంగులాల్‌ తీవ్రంగా గాయపడగా, స్థానికులు చికిత్స నిమిత్తం నగరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సుస్మిత తెలిపారు.

దుండిగల్‌: తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందన్న కోపంతో ఆ మైపె ఓ యువకుడు ద్వేషం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రంజాన్‌(23) 8నెలల క్రితం నగరానికి వలస వచ్చి దుండిగల్‌లోని ఎల్లూరి బస్తీలో ఉంటూ ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడి ఇంటి పక్కనే నివసిస్తున్న ఓ యువతి(19) డిగ్రీ చదువుతుంది. కాగా యువతిని తనను ప్రేమించాలని రంజాన్‌ వేధించాడు. ఆమె తిరస్కరించడంతో కోపం పెంచుకున్న రంజాన్‌ ఈనెల 6న ఉదయం యువతి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement