తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని కత్తితో దాడి

Nov 7 2026 12:30 AM | Updated on Nov 7 2026 12:30 AM

● ఒకరికి తీవ్ర గాయాలు

● మాణిక్‌బండార్‌లో ఘటన

మాక్లూర్‌: భూ వివాదం, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వనందుకు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు కత్తిపోట్లకు గురై, తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని మాణిక్‌బండార్‌ గ్రామంలో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా.. మాణిక్‌భండార్‌ గ్రామానికి చెందిన కటిక శంకర్‌, అదే గ్రామానికి చెందిన మున్సిపల్‌ ఉద్యోగి నీరడి గంగాధర్‌ అలియాస్‌ వినయ్‌ స్నేహితులు. గతంలో శంకర్‌ వద్ద వినయ్‌ అప్పుడప్పుడు మటన్‌ కొనుగోలు చేయడంతోపాటు రూ.10వేలు అప్పుగా తీసుకున్నాడు. వినయ్‌ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో శంకర్‌ అతడి ఇంటికి వెళ్లి, డబ్బులను అడిగాడు. దీంతో వినయ్‌ ఆగ్రహంతో శంకర్‌పై రాడ్‌తో దాడికి పాల్పడ్డాడు. వెంటనే శంకర్‌ ఈవిషయాన్ని కుటుంబీకులతో చెప్పగా శుక్రవారం ఉదయం కారులో వెళుతున్న వినయ్‌ను శంకర్‌ తన అనుచరులు కలిసి వెంబడించి కత్తితో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వినయ్‌ను చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే శంకర్‌, అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై అనిల్‌రెడ్డి వెల్లడించారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ ప్రకాష్‌యాదవ్‌, నార్త్‌జోన్‌ సీఐ శ్రీనివాస్‌ సందర్శించారు. కేసు నమోదు చేసి, విచారిస్తున్నామని ఎస్సై వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement