● కేసీఆర్ హయాంలో రాజుగా రైతు
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర విధ్వంసానికి గురవుతోందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్దగల 44 నెంబరు జాతీయ రహదారిపై గురువారం నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన ఏడాదిన్నరలోనే కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసి దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందించిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 18 సబ్‌స్టేషన్లు, 45 భారీ 5 మెగావాట్ల పవర్‌ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. శ్రీరాంసాగర్‌లో నీటి కొరత శాశ్వతంగా తీర్చడానికి కేసీఆర్ రూ. 1900 కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం (రివర్స్ పంపింగ్) పూర్తిచేశారని వెల్లడించారు. రైతును రాజును చేసి కేసీఆర్ తెలంగాణ బలరాముడిగా నిలిచారని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఆయా మండలాల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్తాం: అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల
నిజామాబాద్ అర్బన్: కాంగ్రెస్ వెయ్యిరోజుల పాల న వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్‌గుప్తా అన్నారు. నగరంలోని ధర్నాచౌక్‌లో గురువారం పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పో యిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వా లసిన రైతు భరోసా, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తున్నరన్నారు. కంఠేశ్వర్ ఆలయ భూములు, గూపన్‌పల్లిలోని వక్ఫ్‌బోర్డు భూములు, 22ఏలో ఎందుకు చేర్చలేదన్నారు. మాజీ మేయర్ నీతూకిరణ్, శేఖర్, నాయకులు సిర్ప రాజు, ప్రభాకర్‌రెడ్డి, సత్య ప్రకా ష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్, జగత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


