సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే..

Sep 4 2026 7:41 AM | Updated on Sep 4 2026 7:41 AM

పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా జిల్లాలో ఉద్యోగుల నిరసన

నిజామాబాద్‌ అర్బన్‌: సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందేనని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు సుమన్‌కుమార్‌ అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల జేఏసీ, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌, టీచర్స్‌, వర్కర్స్‌ అండ్‌ పెన్షనర్స్‌ ఆధ్వర్యంలో మంగళవారం పెన్షన్‌ విద్రోహ దినాన్ని నిర్వహించారు. ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సము దాయంలో మంగళవారం భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ.. 2004 తరువాత ఉద్యోగాల్లో చేరిన వారందరికీ సీపీఎస్‌ గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని, ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమానికి ఉద్యోగు లు తరలిరావాలని పిలుపునిచ్చారు. టీఎన్జీవోస్‌ నాయకులు పెద్దోళ్ల నాగరాజు, శ్రీనివాస్‌, జమీలుల్లా, ధర్మేందర్‌, మారుతి, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement