రుద్రూర్ : బడి అంటే పుస్తకాలు, పరీక్షలు మాత్రమే కాదు.. పిల్లల మనసులను వికసింపజేసే ఒక అందమైన ప్రపంచం. అక్షరాల తోటగా మాత్రమే కా దు.. పచ్చని చెట్లతో కూడిన హరిత లోగిలిగా రూపుదిద్దుకున్నదీ ఆ సర్కారు బడి. పాఠశాల ఆవరణలో నాటిన ప్రతి మొక్క ఒక విద్యార్థి భవిష్యత్తులా పెరుగుతోంది. తరగతి గది లోపల అక్షరాల వెలుగు, బయట ప్రకృతి పచ్చదనం తోడై నందనవనంగా మారింది నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) ప్రాథమికోన్నత పాఠశాల.
పొదుపు అలవాటుకు ‘సంచాయిక’
విద్యార్థుల్లో పొదుపు అలవాటును పెంపొందించేందుకు పాఠశాలలో బాలల సంఘం, ‘సంచాయిక’ కార్యక్రమాలు అమలు చే స్తున్నారు. ప్రతి ఏడాది విద్యార్థులను విజ్ఞాన విహా ర యాత్రలకు తీసుకెళ్లి పాఠ్యాంశాలతోపాటు వివిధ ప్రాంతాల విశేషాలను ప్రత్యక్షంగా తెలుసుకునేలా చేస్తున్నారు. ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, స్పోర్ట్స్‌డ్రెస్ అందజేస్తున్నారు.
ప్రత్యేకం.. ‘తిథి భోజనం’
పాఠశాలలో ‘తిథి భోజనం’ ప్రత్యేక ఆకర్షణగా ని లుస్తోంది. గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల పుట్టిన రోజులు లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో ‘తిథి భోజనం’ పేరిట విద్యార్థులకు ప్రత్యేక వంటకాలను రుచి చూపిస్తున్నారు.
బడిలోనే.. సాగు‘పాఠాలు’
పిల్లలకు చదువుతోపాటు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పా ఠశాల ఆవరణలోనే కూరగాయల సాగు చేపడుతున్నారు. పాఠశాల ప్రాంగణంలో పాలకూర, మెంతికూర, టమాట వంటివి సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. అదే విధంగా పాఠశాల ప్రాంగణంలో పచ్చని మొక్కల మధ్య చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవరణ మొత్తం తీగజాతి, అలంకార మొక్కలైన మయూర పంఖి, స్పైడర్ ప్లాంట్, ఫైకస్, పామ్ జాతి మొక్కలు ఆహ్లాదం పంచడంతోపాటు ఆకట్టుకుంటున్నాయి.
అంబం(ఆర్) ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఆహ్లాదకరమైన గ్రీనరి
పాఠశాల ఆవరణలో చదువుల తల్లి సరస్వతి విగ్రహం
పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ
ప్రయివేటు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించేందుకు ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది. స్లాబ్ మరమ్మతులు, అదనపు టాయిలెట్ల నిర్మాణం, ఖాళీ ఉపాధ్యాయ పోస్టు భర్తీ వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాం. – కుర్లెపు గంగాధర్, సర్పంచ్
80 నుంచి 110కి పెరిగిన విద్యార్థుల సంఖ్య
అంబం(ఆర్) ప్రాథమికోన్నత పాఠశాలలో గతేడాది 80 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 110కి చేరింది. 2016లో గ్రామానికి చెందిన పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని వీడీసీ సభ్యులు గ్రహించారు. వీడీసీ సహకారంతో అప్పటి హెచ్‌ఎం రాంకుమార్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభించారు. దీంతో పాఠశాల సందర్శనకు వచ్చిన ఉన్నతాధికారుల బృందం ఈ పాఠశాలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. కాగా ఈ విద్యా సంవత్సరం పాఠశాలకు ప్రీప్రైమరీ తరగతులు కూడా మంజూరు కావడంతో ఒక టీచర్, ఆయా అందుబాటులోకి వచ్చారు.
గ్రామస్తులు, దాతల సహకారంతోనే..
గ్రామస్తులు, దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థు లకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు పొదుపు అలవాటు, క్రమశిక్షణ, పరిశుభ్రత, విజ్ఞానా న్ని పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు క ల్పించాలి. – మనోజ్ వైద్య, ప్రధానోపాధ్యాయుడు
ఆహ్లాదకర వాతావరణంలో
విద్యార్థులకు పాఠాలు
పొదుపు అలవాట్లు, సాగు పాఠాలు ప్రత్యేకం
ఆదర్శం అంబం(ఆర్)
ప్రాథమికోన్నత పాఠశాల


