ఎవరితోనూ మంతనాలు జరపలేదు | - | Sakshi
Sakshi News home page

ఎవరితోనూ మంతనాలు జరపలేదు

Sep 4 2026 7:41 AM | Updated on Sep 4 2026 7:41 AM

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): కాంగ్రెస్‌ నాయకులతో తా ను మంతనాలు జరపలేదని లక్ష్మీనృసింహుని సన్నిధిలో ఉండి చెబుతున్నానని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన రెండో రోజే తాను కాంగ్రెస్‌తో మంతనాలు జరిపానని కవిత చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రస్తుత కష్ట కాలంలో కేసీఆర్‌ వెంట ఉన్నది ఎవరో కవిత చెప్పాలని డిమాండ్‌ చేశారు. భీమ్‌గల్‌ లింబాద్రి గుట్టపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో, ప్రజాక్షేత్రంలో సీఎం రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది ప్రశాంత్‌రెడ్డి నా.. కవితనా అని ప్రశ్నించారు. తను రహస్యంగా కాంగ్రెస్‌ నాయకులతో మంతనాలు చేయలేదని కవిత చెప్పగలరా అని నిలదీశారు. ఎవరి ప్రయోజనాల కోసం కవిత తనపై నిరాధార ఆరోపణలు చేశారో ప్రజలకు తెలుసన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌, కవితను కలపడానికి ప్రయత్నం చేశానో, లేక విడదీయడానికి ప్రయత్నం చేశానో కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. పార్టీ లైన్‌ దాటిన తర్వాతనే కేసీఆర్‌ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని స్పష్టం చేశారు. కవిత సభలో కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయంగా సానుభూతిని సంపాదించడానికేనని అర్థమవుతోందని, అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

లక్ష్మీనృసింహుని సన్నిధిలో ఉండి

చెబుతున్నా..

తను కాంగ్రెస్‌తో మంతనాలు

జరపలేదని కవిత చెప్పగలరా?

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే

ప్రశాంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement