వేల్పూర్(బాల్కొండ): నియంతృత్వ బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు పదేళ్లు నిర్బంధంలో ఉన్నారని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా పనులు చేసుకుంటున్నారరని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం ఆయన కాంగ్రెస్ వేయి రోజుల ప్రజాపాలనపై నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ, బహిరంగ సభలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. కబ్జాలు, కమీషన్లకు అలవాటుపడిన వారు నిజాయితీ గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ము త్యాల సునీల్‌కుమార్ అన్నారు. అనంతరం బా ల్కొండ నియోజవకర్గంలో బీఆర్‌ఎస్ హ యాంలో చేసిన దౌర్జన్యాలను పేర్కొంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. వేల్పూర్ ఏఎంసీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.


