క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు డీజే నిర్వాహకుల బైండోవర్‌

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల సమీపంలోని తాడ్వాయి–చందాపూర్‌ రహదారిపై రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. తాడ్వాయికి చెందిన లింగవోల జీవన్‌ అనే వ్యక్తి తన బైక్‌పై తాడ్వాయి నుంచి చందాపూర్‌ వైపు బయలుదేరాడు. అదే సమయంలో బ్రహ్మాజివాడి గ్రామానికి చెందిన దేవునిపల్లి శ్రావన్‌ తన బైక్‌పై చందాపూర్‌ నుంచి తాడ్వాయికి వస్తున్నాడు. బాలికల గురుకుల పాఠశాల సమీపంలో ఇరువురి బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో జీవన్‌, శ్రావణ్‌లకు తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. జీవన్‌ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు.

ఇసుక ట్రాక్టర్‌ స్వాధీనం

గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలోని గుర్జాల్‌ బీట్‌లో నుంచి గురువారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్వో రమేష్‌ తెలిపారు. గుర్జాల్‌ చెందిన జయరాం ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పట్టుకుని ట్రాక్టర్‌ను ఫారెస్టు రేంజ్‌కు తరలించినట్లు తెలిపారు.

కోటగిరి మండలంలో..

రుద్రూర్‌: మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు కోటగిరి ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. కోటగిరి మండలం లింగాపూర్‌ గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఇసుక ట్రాక్టర్‌ను నిలిపి తనిఖీ చేశారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కోటగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ట్రాక్టర్‌ యజమానితోపాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

మద్నూర్‌(జుక్కల్‌): మండలంలోని డీజే నిర్వాహకులను గురువారం తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. రానున్న గణపతి నవరాత్రుల్లో ఊరేగింపు శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని ఎస్సై పేర్కొన్నారు. దీంతో మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌కు మండలంలోని డీజే నిర్వహకులను పిలిపించి తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement