సుభాష్‌నగర్: ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్‌మెంట్‌ట్ బిల్ – 2026పై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంపీ అర్వింద్ ధర్మపురి సభ్యుడిగా నియమితులయ్యారు. లోక్‌సభ గురువారం విడుదల చేసిన అధికారిక బులెటిన్‌లో జాయింట్ కమిటీ సభ్యుల జాబితాలో అర్వింద్ ధర్మపురి పేరు నమోదైంది. కమిటీలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 31 మంది సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమైన బాధ్యతను నిర్వర్తించే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాలు, జాతీ య భద్రత, పారదర్శకత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని బిల్లుపై జాయింట్ కమిటీలో సమగ్రంగా చర్చించి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.
5 నుంచి ప్రత్యేక
ఓటరు నమోదు
నిజామాబాద్ అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప రిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్ర మం (స్పెషల్ క్యాంపెయిన్) నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రత్యేక ఓటరు నమోదు కోసం ప్రతి బూత్ లెవల్ అధికారి తమకు కేటాయించిన ప్రదేశంలో అందుబాటులో ఉంటారన్నారు. ఓటర్లకు అవసరమైన ఫారం–6, 7, 8లతో పాటు ముసాయిదా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన వారు ఫారం–6 ద్వారా, ఓటరు జాబితా లోని పేర్ల తొలగింపు లేదా అభ్యంతరాలకు ఫారం–7 ద్వారా, ఓటరు వివరాల్లో మార్పు లు, సవరణలు, చిరునామా మార్పు వంటి వాటికి ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రాథమిక నైపుణ్యాలపై దృష్టి సారించాలి
● ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేశ్
ఖలీల్‌వాడి: విద్యార్థులకు చదవడం, రాయడం, గణిత ప్రాథమిక నైపుణ్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా జీపీఎస్ గద్వాల్ పాఠశాలతోపాటు నాగారంలోని విద్యా శిక్షణా సంస్థ(డైట్)ను గురువారం డీఈవో అశోక్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల అభ్యసన స్థాయి, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాల అమలు, బోధన–అభ్యసన ప్రక్రియ, విద్యార్థుల హాజరు, పాఠశాల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డైట్ కళాశాలలోని పరిసరాలను, తరగతి గదుల్ని, వసతులను పరిశీలించారు. ఛాత్రోపాధ్యాయులతో మాట్లాడారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, డైట్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
అసంక్రమిత
వ్యాధిగ్రస్తులను గుర్తించాలి
రెంజల్: అసంక్రమిత వ్యాధిగ్రస్తులను గుర్తించి వా రికి అవసరమైన మందులను ఉచితంగా అందజేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ వసే సూచించారు. గురువారం రెంజల్ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ౖఅసంక్రమిత వ్యాధి గ్రస్తులు, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో కలియతిరుగుతూ వసతులను తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రామ్ అధికారి వెంకన్న, రెంజల్ ఆస్పత్రి వైద్యుడు సుధాకర్, ఎన్‌సీడీ రిపోర్టింగ్ అధికారి వెంకటేశ్, ఆరోగ్య విస్తరణ అధికారులు రవీందర్, సురేశ్ తదితరులున్నారు.


