● ఇతర రాష్ట్రాల మద్యం వినియోగం
● గంజాయి, పేకాట జోరు
● చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ శాఖ
నిజామాబాద్ అర్బన్: కాలానికి అనుగుణంగా విందు, వినోదాల సంస్కృతి పెరుగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజులతోపాటు ప్రత్యేక రోజుల పేరిట జిల్లాకు చెందిన కొందరు లిక్కర్ పార్టీలు నిర్వహిస్తున్నారు. జిల్లా, మండల కేంద్రాల శివారు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటైన ఫామ్‌హౌస్‌లు లిక్కర్ పా ర్టీలకు అడ్డాగా మారాయి. అయితే, ఈ విందుల్లో నిషేధిత మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థా ల వినియోగంతోపాటు అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. జిల్లాలోని గుత్ప, సారంగాపూర్, ధర్మపురి హిల్స్, మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి, డిచ్‌పల్లి మండలం లింగసముద్రం రోడ్, బోధన్, నందిపేటలోని గోదావరి బ్యాక్‌వాటర్, మాక్లూర్ మండలం అడవి మామిడి పల్లి శివారులలో ఏర్పాటు చేసిన ఫామ్‌హౌస్‌లలో ప్రతి వారం లిక్కర్ పార్టీలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక రోజులతోపాటు శని, ఆదివారాల్లో పార్టీలు నిర్వహిస్తున్నారు. సెలెబ్రెషన్స్ మోజులో కర్న్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన మద్యం వినియోగిస్తుండటంతోపాటు పేకాట ఆడుతున్నారు. కొంద రు నిర్వాహకులు ఫామ్‌హౌస్‌లను అద్దెకు తీసుకొని మరీ పేకాట ఆడిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.


