● మండపాల ఏర్పాటుకు
అనుమతి తీసుకోవాలి
● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య
బోధన్‌టౌన్(బోధన్): గణేశ్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో సోదర భావంతో నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నా రు. పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి ఆవరణ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం శాంతి కమిటీ, గణేశ్ మండప నిర్వాహకులతో సన్నా హక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గణేశ్ మండపాలు ఏర్పాటు చే సే వారు పోలీసుల అనుమతి తీసుకోవాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మండపాల వద్ద డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన శబ్ద పరిమితులను, సమయపాలనను తప్పని సరిగా పాటించా లని సూచించా రు. నిమజ్జన సమయంలో పోలీస్‌శాఖతో సమన్వ యం చేసుకొని ముందుకు సాగాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను న మ్మొద్దని, ఏదైనా అనుమానాస్పద సమాచారం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూ చించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే స హించేది లేదని స్పష్టం చేశారు. వినాయక మండపా ల వద్ద రాత్రి వేళల్లో నిర్వాహకులు ఉండాలన్నారు. ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ప్రజాప్రతినిధులు, మండపాల నిర్వహకులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న
సీపీ సాయిచైతన్య
పాల్గొన్న గణేశ్ మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు


