భవితవ్యం తేలేదెన్నడో..? | - | Sakshi
Sakshi News home page

భవితవ్యం తేలేదెన్నడో..?

Sep 4 2026 1:36 AM | Updated on Sep 4 2026 1:36 AM

ఎన్‌సీఎస్‌ఎఫ్‌ పునరుద్ధరణ అయ్యేనా..

ఫ్యాక్టరీలో యంత్రాలు

కేంద్ర ప్రభుత్వం ఇథనాల్‌ను ప్రోత్సహిస్తున్నందున ఎన్‌సీఎస్‌ఎఫ్‌ను ఇథనాల్‌ ఫ్యాక్టరీగానైనా మార్చాలని కోరాం. కానీ భారీ బడ్జెట్‌, పర్యావరణ అనుమతులు, ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. తక్కువ పెట్టుబడితోనైనా ఫ్యాక్టరీని చిన్న తరహా బెల్లం పరిశ్రమగానైనా మారిస్తే ప్రాంతీయ చెరకు రైతులకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వం స్పందించి బెల్లం ఫ్యాక్టరీగానైనా మార్చాలి. – చెరుకు ఉత్పత్తిదారుల సంఘం

సభ్యులు, రైతు నాయకులు

నిజామాబాద్‌ రూరల్‌: రైతులు, కూలీలు, కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన నిజామాబాద్‌ కో ఆపరేటీవ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ(ఎన్‌సీఎస్‌ఎఫ్‌) భవిత వ్యం ఎటూ తేలడం లేదు. ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు ఉద్యమిస్తూనే ఉ న్నారు. రైతులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఫ్యాక్టరీ అనేక కారణాలతో 2008 నుంచి 2015 వరకు క్రమంగా మూతపడింది. ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని పార్టీలు, ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తూనే ఉన్నారు. 23వేల మందికిపైగా రైతులు స భ్యులు(షేర్‌ హోల్డర్లు)గా ఉన్న ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంలోనే నడిపించాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తూనే ఉంది. రాష్ట్రంలోని చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన సబ్‌కమిటీ సైతం ఎన్‌సీఎస్‌ఎఫ్‌ను సందర్శించింది. ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.

సబ్‌ కమిటీ ఏం చెప్పిందంటే..

ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్రభుత్వానికి సానుకూల నివేదికను సమర్పించిన సబ్‌ కమిటీ పలు సూచనలు చేసింది. చెరుకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇవ్వాలని, ధాన్యానికి ఇస్తున్న మాదిరిగానే చెరుకుకు సైతం బోనస్‌ ఇవ్వాలని, డ్రిప్‌ పరికరాలను అందించాలని సూచించింది. బెల్లం ఫ్యాక్టరీగా మార్చాలనే రైతు నాయకులు, రైతులు, ప్రజాప్రతినిధులు సిఫార్సులను సబ్‌ కమిటీ పరిగణనలోకి తీసుకుంది.

సాగుకు రైతులు సిద్ధమే..!

ఆరు తడి పంటలు సాగు చేయాలని ప్రజాప్రతినిధు లు, అధికారులు సూచిస్తుండగా.. ఎన్‌సీఎస్‌ఎఫ్‌ను పునరుద్ధరిస్తే తాము చెరుకు సాగుకు సిద్ధమేనని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జూలై నెలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమావేశంలోనూ రైతులు ఇదే అంశాన్ని లేవనెత్తారు.

ఫ్యాక్టరీ ముఖద్వారం

రైతులకు అవగాహన

కల్పించాలి

చెరకు సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. చెరుకు సాగు చేస్తే ఎవరు కొంటారు? ఎక్కడికి తరలించాలి అనే అనేక సందేహాలు రైతుల్లో ఉన్నాయి. ఎన్‌సీఎస్‌ఎఫ్‌ పునరుద్ధరణపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం చెరుకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేయాలి. – పోల వంశీరెడ్డి, బర్ధిపూర్‌

ప్రభుత్వం సానుకూలంగా

స్పందించాలి

రైతులు చెరుకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్‌సీఎస్‌ఎఫ్‌ పునరుద్ధరణపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. రైతులు షేర్‌ హోల్డర్లుగా ఉన్న ఫ్యాక్టరీని మూసివేయడం బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – ఆకుల పాపయ్య,

రైతు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్‌

నిధులు కేటాయించాలి

ఫ్యాక్టరీ పునరుద్ధరణపై రైతులకు భరో సా కల్పించాల్సిన బా ధ్యత రేవంత్‌రెడ్డి ప్ర భుత్వానిదే. రైతులు చెరుకు సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. చక్కెర ఫ్యాక్టరీ ని బెల్లం ఉత్పత్తి కేంద్రంగా మార్చి ప్రభుత్వ మే నడిపించాలి. ఇందుకోసం రూ.వంద కో ట్లు కేటాయించాలి. – వేల్పూర్‌ భూమయ్య,

ఏఐకేఎంఎస్‌ అధ్యక్షుడు

మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్సీఎస్‌ఎఫ్‌ను సైతం పునరుద్ధరించాలని సబ్‌ కమిటీతోపాటు సీఎంను కూడా కోరా. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీని ప్రైవేట్‌ పరం చేయబోం. ఫ్యాక్టరీ నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. – ఎన్‌సీఎస్‌ఎఫ్‌ను సందర్శించిన సమయంలో రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి

గత వైభవం..

1964లో రైతులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎన్‌సీఎస్‌ఎఫ్‌ సుమారు 10వేల మందికి ఉపాధి కల్పించింది.

23,143 మంది రైతులు షేర్‌ హోల్డర్లుగా ఉన్నారు.

రైతుల వాటా రూ.2.95 కోట్లు, ప్రభుత్వ వాటా రూ.50 లక్షలు

రోజుకు సుమారు 1,250 నుంచి 2,000 టన్నుల చెరకును నలిపి సీజన్‌లో వేల టన్నుల చక్కెర ఉత్పత్తి అయ్యేది.

ఇక్కడ ఉత్పత్తి అయిన చక్కెర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతటా సరఫరా అయ్యేది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేసేవారు.

దాదాపు 1,000 నుంచి 1,500 మంది వరకు పూర్తిస్థాయి, సీజనల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేసేవారు. పరోక్షంగా వేలాది మంది రైతు కుటుంబాలు ఫ్యాక్టరీపై ఆధారపడేవి.

ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తారా? బెల్లం ఫ్యాక్టరీగా మారుస్తారా?

ఫ్యాక్టరీ మూతపడి సుమారు 18 ఏళ్లు అవుతుండగా, యంత్రాలు అసలు పనికి వస్తాయా? లేవా? రైతుల భాగస్వామ్యంతో ఫ్యాక్టరీని నడిపించడం సాధ్యమేనా? ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్న చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు, రైతులు ఇథనాల్‌ ఫ్యాక్టరీ గా మార్చాలని మొదట కోరారు. అయితే బడ్జెట్‌, అనుమతులు కష్టమేననే అభిప్రాయం మేరకు బెల్లం ఫ్యాక్టరీగా మార్చాలని డిమాండ్‌ చేస్తున్నా రు. చెరుకు సాగు బాధ్యత రైతులు తీసుకుంటా రని అంటున్నారు. తక్కువ పెట్టుబడితో, తక్కు వ సమయంలో బెల్లం ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యమని, ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు సమావేశాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో రైతు సమ్మేళనం ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేయడంతోపాటు పలు కీలక తీర్మానాలు చేశారు. రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సైతం ఫ్యాక్ట రీ పునరుద్ధరఫై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు.

ఉద్యమిస్తున్న రైతు నాయకులు

ఏళ్లుగా నిరీక్షిస్తున్న కార్మికులు

తుప్పుపడుతున్న యంత్రాలు

బెల్లం ఉత్పత్తి కేంద్రంగా

మార్చాలంటున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement