● ఉత్తమ ఉపాధ్యాయుడిగా నారాయణరెడ్డి
ఖలీల్‌వాడి/ తెయూ(డిచ్‌పల్లి)/ మాక్లూర్ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికై న వారి వివరాలను కళాశాల విద్యా కమిషనర్ గురువారం వెల్లడించారు. రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ కె.రంజిత (కామర్స్), డాక్టర్ పి.రామకృష్ణ (భౌతిక శాస్త్రం) ఎంపికై నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్ లావణ్య ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికయ్యారు. ఉత్తమ ప్రిన్సిపల్‌గా నాగారం డైట్ కళాశాల ప్రిన్సిపల్ టి. శ్రీనివాస్, ఉత్తమ ఉపాధ్యాయుడిగా మాక్లూర్ మండలం మదన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన నారాయణరెడ్డిని ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 5న హైదరాబాద్‌లో నిర్వహించనున్న గురుపూజోత్సవంలో అవార్డులు స్వీకరించనున్నారు.


