ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవితండా శివారులో 1223 సర్వే నంబరులో కొందరు యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ అటవీ భూములను ఆక్రమించాలని చూస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ సర్వే నంబరులో రెవెన్యూ, ఫారెస్ట్ సరిహద్దు వివాదం ఉందని తెలిసినా, పట్టాలు, ఎలాంటి హక్కులు లేకున్నా కొందరు చట్టాన్ని అతిక్రమిస్తూ చెట్లను నరకడం స్థానికంగా చర్చనీయ అంశంగా మారింది. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని, ఇకనైనా స్పందించి అడవులను కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయమై రేంజ్ అధికారి రవి మోహన్ భట్‌ని సంప్రదించగా నరికివేతకు గురైన చెట్లను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సిరికొండ: సిరికొండ అటవీశాఖ రేంజ్ పరిధిలోని తాటిపల్లి బీట్ అటవీ ప్రాంతంలో అక్రమంగా భూ ఆక్రమణకు ప్రయత్నించిన గ్రా మానికి చెందిన భూక్యా మోహన్‌పై కేసు న మోదు చేసినట్లు సిరికొండ ఎఫ్‌ఆర్‌వో నర్సింగరావు సోమవారం తెలిపారు. మోహన్‌ను సిరికొండ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం అటవీ భూములకు ఎలాంటి హక్కులు కల్పించడం లేదని, కావున ఎవరు కూడా అటవీ భూముల ఆక్రమ ణకు పాల్పడవద్దని ఎఫ్‌ఆర్‌వో సూచించారు.
వర్ని: చందూర్ మండలం ఘన్‌పూర్ అటవీ ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా టిప్పర్లలో మొరం తరలిస్తుండగా పట్టుకున్నట్లు చందూర్ తహసీల్దార్ వీర్‌సింగ్ సోమ వారం తెలిపారు. అనుమతులు లేకుండా ఆరు టిప్పర్లలో మొరం తరలిస్తుండగా పట్టుకొని కార్యాలయానికి తరలించినట్టు వివరించారు. వాహనాలతోపాటు యజమాని, డ్రైవర్‌పై కేసులో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
బోధన్ మండలంలో..
బోధన్ రూరల్: మండలంలో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై రాజశేఖర్ సోమవారం తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు.


