సుభాష్‌నగర్: లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ట్ సిటీ, వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో శనివారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సుమారు మూడు వందల మందికి బీఎండీ, షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలను ఉచితంగా చేశారు. కార్యక్రమంలో లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం, జిల్లా కార్యదర్శులు డీ యాదగిరి, పీ లక్ష్మీనారాయణ, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ట్‌సిటీ అధ్యక్ష, కార్యదర్శులు పీ రవీంద్ర కుమార్ గుప్తా, శివరాజం, ప్రాజెక్టు చైర్మన్లు డీ నాగేశ్వరరావు, బిర్ల రామారావు, కోశాధికారి పెద్ది రాజేందర్, లయన్స్, వాసవి క్లబ్ ప్రతినిధులు రాఘవేందర్, చింతల గంగాదాస్, మండవ రామకృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


