
వరద గేట్ల వైపు అనుమతి నిరాకరణ
● పర్యాటకుల ఆగ్రహం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల చేపట్టడంతో ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. కానీ పర్యాటకులను వరద గేట్ల వైపు డ్యాంపైకి వెళ్లడానికి అధికారులు అనుమతివ్వడం లేదు. ప్రాజెక్ట్ ఆనకట్టపైకి మాత్రం అనుమతిస్తున్నారు. కొందరికి మాత్రం డ్యాంపైకి కూడ అనుమతిస్తున్నారు. అయినవారికి మాత్రం అధికారులు నిబంధనలు పెట్టడం లేదు. దీంతో ఒక్కసారిగా పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్యాంగేటు వద్దకు దూసుకువచ్చారు. డ్యాంపైకి వెళ్లి తీరుతామంటూ నినాదాలు చేశారు. అధికారుల, పోలీసుల బంధువులకు ఎలా అనుమతిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్, ప్రాజెక్ట్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదం చేశారు. కొందరు గేటు దూకి లోపలికి వెళ్లారు. ప్రాజెక్ట్‌పైకి మీడియాకు కూడ అనుమతివ్వడం లేదు. ఉన్నతాఽధికారులు స్పందించి అందరికి సమాన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.