
3,817 ఎకరాల్లో పంటనష్టం
● వ్యవసాయశాఖ ప్రాథమిక
అంచనా
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎడతెరిపి లేకుండా కు రిసిన వర్షాలకు జిల్లాలో 3,817 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం మొ త్తం బోధన్ డివిజన్‌లోనే జరిగింది. గోదావరికి ఆనుకుని ఉన్న మండలాలు, గ్రామాల్లో భారీగా పంటలు వరద నీట మునిగాయి. అత్యధికంగా 3,355 ఎకరాల్లో సోయా, 450ఎకరాల్లో వరి, ఐదెకరాల్లో పత్తి, మరో ఐదెకరాల్లో పెసర, రెండెకరాల్లో పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. రెంజల్ మండలంలోని కల్దుర్కి, తాడ్‌బిలోలి, బోర్గాం, బోధన్ మండలం హంగర్గ, కొప్పర్గ, బిక్‌నెల్లి, ఖండ్‌గావ్, సిద్ధాపూర్, అలాగే సాలూర మండలం హున్సా, ఖాజాపూర్, మందర్న, తగ్గెల్లి గ్రా మాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసా య శాఖ గుర్తించింది. మొత్తం 1,092 మంది బాధిత రైతుల పేర్లు నమోదు చేసుకున్నారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, వరద నీటి నుంచి పంట తేలిన తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి పంపుతామని డీఏవో గోవింద్ ‘సాక్షి’కి తెలిపారు.
కార్పొరేషన్ కమిషనర్‌గా యాదగిరిరావు
● అడిషనల్ కమిషనర్‌గా రవీంద్రసాగర్
● నేడు బాధ్యలు స్వీకరించనున్న
అధికారులు
● దిలీప్‌కుమార్‌కు ఐఏఎస్ ఖరారు
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ దిలీప్‌కుమార్‌కు ఐఏఎస్ ఖరారు కావడంతో ఆ యనకు శిక్షణకు వెళ్లనున్నారు. నూతన కమిషనర్‌గా ఎన్ యాదగిరిరావు నియమితులయ్యారు. తెలంగాణలోని పలు కార్పొరేషన్ల కమిషనర్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవా రం జీవో ఎంఎస్ నంబర్ 87 జారీ చేసింది. సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్‌గా వెయిటింగ్‌లో ఉన్న ఎన్.యాదగిరిరావు నిజామాబాద్‌కు రానున్నారు. అడిషనల్ కమిషనర్‌గా పి రవీంద్రసాగర్ నియమితులయ్యారు. గురువారం ఉదయం ఇరువురు ఉన్నతాధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు.
డీజేలు నిషేధం : సీపీ
ఖలీల్‌వాడి: గణేశ్ మండలి నిర్వాహకులు ని బంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని, వాటిని పూర్తిగా నిషేధించినట్లు పే ర్కొన్నారు. మండపాల వద్ద విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలని పేర్కొన్నారు. మండపాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. ప్రతిష్టాపన, నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

3,817 ఎకరాల్లో పంటనష్టం