
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జీవీఎన్ భరతలక్ష్మి
నిజామాబాద్ లీగల్ : జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 250 కేసులను మీడియేషన్ ద్వారా పరిష్కరించేందుకు గుర్తించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి పేర్కొన్నారు. మీడియేషన్ ఫర్ నేషన్‌లో భాగంగా నల్సా (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) పిలుపు మేరకు జిల్లా కోర్టులో గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ కేసుల త్వరితగత పరిష్కారానికి మీడియేషన్ ఉపయోగపడుతుందని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు మీడియేషన్‌పై ఆధారపడుతున్నాయని తెలిపారు. పేరుకుపోతున్న కేసుల పరిష్కారానికి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మీడియేషన్ ప్రక్రియకు ప్రాధాన్యమిస్తోందన్నారు. సమావేశంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్‌రావు, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్‌రాజ్, వివిధ కోర్టుల జడ్జీలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.