
ఏసీబీకీ పట్టుబడ్డ ఆర్మూర్ ఎంవీఐ
ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని ఏవీఐ కార్యాలయంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గుర్రం వివేకానందరెడ్డి రూ. 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టణంలోని పెర్కిట్ శివారులో గల తన కార్యాలయంలో గురువారం జిల్లా కేంద్రానికి చెందిన ఫిర్యాదు దారుడి నుంచి తన ప్రైవేటు డ్రైవర్ తిరుపతి మధ్య వర్తిగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సుల పునరుద్ధణ, లెర్నింగ్ లైసెన్స్‌ల జారీ తదితర ఫైళ్ల క్లియరెన్స్‌కు ఏజెంట్ వద్ద ఎంవీఐ లంచం డిమాండ్ చేసాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు పక్కా ప్రణాళిక ప్రకారం సదరు ఏజంట్ ఎంవీఐ ప్రైవేటు డ్రైవర్‌కు రూ. 25 వేల లంచం ఇవ్వగా వాటిని డ్రైవర్ ఎంవీఐకి అందజేసాడు. వెంటనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ చంద్ర శేఖర్‌గౌడ్ వివరించారు. విచారణ పూర్తయిన అనంతరం నిందితుడిని హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్తామని డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నగేష్, శ్రీనివాస్ ఉన్నారు.
ఆర్టీవో ఏజెంట్ వద్ద ప్రైవేటు డ్రైవర్ ద్వారా రూ.25 వేలు లంచం
తీసుకుంటూ దొరికిన వైనం
కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా
పట్టుకున్న ఏసీబీ అధికారులు