కొత్త కార్డుదారులకూ రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్త కార్డుదారులకూ రేషన్‌

Aug 22 2025 6:39 AM | Updated on Aug 22 2025 6:39 AM

కొత్త కార్డుదారులకూ రేషన్‌

కొత్త కార్డుదారులకూ రేషన్‌

బియ్యం సరఫరా చేస్తున్నాం

సెప్టెంబర్‌ 1 నుంచి దుకాణాల్లో

సన్నబియ్యం పంపిణీ

జిల్లాలో 44,278 కుటుంబాలకు

కార్డులు మంజూరు

సుభాష్‌నగర్‌ : జిల్లాలో పాత కార్డుదారులతోపాటు కొత్తగా మంజూరైన కార్డుదారులకూ సెప్టెంబర్‌ 1 నుంచి రేషన్‌దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వర్షాకాలంలో వరదలు, వర్షాల నేపథ్యంలో పేదలు రేషన్‌ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని భావించిన కేంద్రం జూన్‌లో ఒకేసారి మూడు నెలల బియ్యం కోటాను పంపిణీ చేసింది. సెప్టెంబర్‌ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కొనసాగనుంది. ఈ మేరకు సెప్టెంబర్‌ నెల కోటా సన్నబియ్యం మండల్‌ లెవల్‌ స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు చేరుతున్నాయి. జిల్లాలో 4,47,788 ఆహార భద్రతా కార్డులుండగా అందులో 15,21,062 మంది సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి కొత్తగా ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా కొత్తగా 44,278 కార్డులు మంజూరు కాగా, కార్డుల్లో 1,26,559 మంది సభ్యులుగా చేరారు. ఈ నేపథ్యంలో 759 రేషన్‌దుకాణాల ద్వారా 7,639 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యాన్ని సెప్టెంబర్‌ 1 నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు.

సెప్టెంబర్‌ 1 నుంచి పాత కార్డుదారులతోపాటు కొ త్త కార్డుదారులకు కూడా సన్నబియ్యం పంపిణీ చే యాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎంఎల్‌ఎస్‌ పా యింట్ల నుంచి రేషన్‌దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నాం. జిల్లాలోని కార్డుల సంఖ్యకు అనుగుణంగా చేతి సంచీలు చేరాయి. కానీ కార్డుదారులకు పంపిణీ చేయాలనే ఆదేశాలు మాత్రం అందలేదు.

– శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మేనేజర్‌,

పౌరసరఫరాల సంస్థ

ఉచితంగా చేతి సంచి!

రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యంతోపాటు ప్ర త్యేకంగా రూపొందించిన పర్యావరణహితమైన చేతి సంచిని ప్రభుత్వం ఉచితంగా అందజేయనుంది. ఈ బ్యాగుపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పౌరసరఫరా లశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఫొటోలతో పాటు మధ్యలో ఇందిరమ్మ అభయహస్తం పేరు తో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలు, ‘అందరికీ సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే నినాదం ముద్రించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement