
యాపిల్స్ డీసీఎం బోల్తా
బాల్కొండ: మెండోరా మండలం బుస్పాపూర్ వద్ద జాతీయ రహదారి 44పై గురువారం ఉదయం హైదరాబాద్ వెళ్తున్న యాపిల్స్ లోడ్ డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. అతి వేగంగా రావడంతో అదుపు తప్పి బోల్తాపడగా డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో హైవేపై 45 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచి పోయింది. హైవే సిబ్బంది స్పందించి క్రేన్ సాయంతో వ్యాన్‌ను తొలగించారు. వేరే వాహనంలో యాపిల్స్‌ను తరలించారు. వారం క్రితం నిర్మల్ వైపు వెళ్తున్న బొప్పాయి లోడ్ డీసీఎం వ్యాన్ ఇక్కడనే బోల్తా పడింది.