ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరుబాట

Aug 22 2025 6:39 AM | Updated on Aug 22 2025 6:39 AM

ఉద్యో

ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరుబాట

సీపీఎస్‌ మా పాలిట శాపం

డిమాండ్లను పరిష్కరించాలి

ఓపీఎస్‌ అమలు చేయాలి

నిజామాబాద్‌అర్బన్‌: సీపీఎస్‌(కాంట్రిబ్యూటరీ పెన్ష న్‌ స్కీం), యూపీఎస్‌ (యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం)లు గుదిబండగా మారాయని ఉద్యోగ, ఉపాధ్యాయు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌(ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం)ను అమలు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. సమస్య తీవ్రతను తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పడుతున్నాయి. పీఆర్టీయూ, ఉద్యోగ సంఘాల సహకారంతో సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహదినం సందర్భంగా హైదరాబాద్‌లో మహాధర్నాకు పిలుపునిచ్చింది. మరోవైపు నూతన పీఆర్‌సీ, ఐదు డీఏల పెండింగ్‌ ఇతర ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఈ నెల 23న హైదరాబాద్‌లో మహాధర్నా చేపట్టనుంది.

సీపీఎస్‌ రద్దుపైనే ప్రధాన ఆందోళన

2024 సెప్టెంబర్‌ 1 నుంచి కొత్తగా నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ విధానం అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ జాబితాలో జిల్లాలో 8,432 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. సీపీఎస్‌ విధానంలో భాగంగా వచ్చే జీతంలో పది శాతం, ప్రభుత్వం మరో 10 శాతం కలిపి షేర్‌ మార్కెట్లో పెట్టనున్నది. వాటి ద్వారా వచ్చిన లాభాల ఆధారంగా పెన్షన్‌ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నష్టాలు జరిగితే ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. పాత పెన్షన్‌ విధానంలో ఉద్యోగి చనిపోతే భార్యకు పెన్షన్‌ అందించేవారు. కానీ సీపీఎస్‌ విధానంలో భార్యకు ఇచ్చే పెన్షన్‌ రద్దు చేస్తున్నారు. ఉద్యోగి జమ చేసిన నగదులో 60 శాతం మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 40 శాతం పెన్షన్‌ రూపంలో ఇస్తారు. ఇలా చాలా రూపాల్లో నష్టపోతామనే ఆందోళన చెందుతున్నారు. సీపీఎస్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ఏకీకృత పెన్షన్‌ పథకం(యూపీఎస్‌) మరో అసంపూర్ణ పథకమని, దీంతో ఉద్యోగులకు ఏమాత్రం రక్షణ, ప్రయోజనం లేదని అభిప్రాయపడుతున్నారు.

ఏకతాటిపైకి ఉపాధ్యాయ సంఘాలు

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకునేందుకు అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. సమష్టిగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి. పదోన్నతులు, పీఆర్సీ, డీఎస్సీ–2003 వారికి పాత పెన్షన్‌ పునరుద్ధరణ, పండిత్‌ పోస్టులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టుల కేటాయింపు తదితర డిమాండ్లతో 16 సంఘాలు కలిసి ఐక్య పోరాట కమిటీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. పీఆర్సీ అమలుతోపాటు 63 డిమాండ్లతో అక్టోబర్‌ 12న ఉద్యోగ, ఉపాధ్యాయుల జేఏసీ చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టనుంది. లక్ష మంది ఉద్యోగ, ఉపాధ్యాయులతో నిరసన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

యూపీఎస్‌ను తిరస్కరిస్తున్న

ఉపాధ్యాయులు

రేపు యూఎస్‌పీఎస్‌ మహాధర్నా

సెప్టెంబర్‌ 1న హైదరాబాద్‌లో

పీఆర్‌టీయూ ఆందోళన

మద్దతిస్తున్న టీజీజేఏసీ, టీఎన్‌జీవోలు

ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట సీపీఎస్‌ శాపంగా మారింది. షేర్‌ మార్కెట్‌లో మా జీతాలు పెట్టి వచ్చిన లాభాల ఆధారంగా పెన్షన్‌ ఇవ్వడం సరైంది కాదు. ఆర్థిక ప్రయోజనం లేని సీపీఎస్‌ను తిరస్కరిస్తున్నాం.

– వెంకట రాజారెడ్డి, సీపీఎస్‌ ఉపాధ్యాయుడు

ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. సీపీఎస్‌ను రద్దు చేసి, పీ ఆర్సీని వెంటనే ప్రకటించా లి. ఉద్యోగ, ఉపాధ్యాయుల కు మేలు జరిగేలా చూడాలి.

– నాగరాజు, టీఎస్‌వోఎస్‌ అసోసియేట్‌ అధ్యక్షుడు

సీపీఎస్‌, యూపీఎస్‌లను రద్దు చేసి పాత పెన్షన్‌ వి ధానాన్ని అమలు చేయాలి. సీపీఎస్‌ రద్దు చేయాలని సెప్టెంబర్‌ 1న హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలి.

– మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు

ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరుబాట1
1/3

ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరుబాట

ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరుబాట2
2/3

ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరుబాట

ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరుబాట3
3/3

ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరుబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement