
పిన్‌కోడ్‌లో ఆరు అంకెల రహస్యం
మీకు తెలుసా?
సదాశివనగర్(ఎల్లారెడ్డి): తపాలా కార్యకలాపాల్లో పిన్‌కోడ్ నంబరులు కీలక పాత్ర పోషిస్తాయి. తపాలా శాఖ పరిధిలో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేందుకు ఆరు అంకెల పిన్‌కోడ్‌ను ఉపయోగిస్తారు.
● చాలా ఏళ్లుగా ఉత్తరాలు, వస్తువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపడంతోపాటు ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మార్కెటింగ్ కార్యకలాపాలు పిన్ కోడ్ ఆధారంగా కొనసాగిస్తున్నారు.
● మన దేశంలో 1972 ఆగస్టు 15 నుంచి పిన్‌కోడ్ నంబరు వినియోగంలోకి వచ్చింది.
● పిన్‌కోడ్ నంబర్ల ఆధారంగా వినియోగదారులకు తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయి.
● ఆరు అంకెలా పిన్‌కోడ్‌లో మొదటి అంకె జో న్‌ను, రెండో అంకెను సర్కిల్‌ను, మూడో అంకె జిల్లా చివరి మూడు అంకెలు తపాలా కార్యాల యం ఉన్న ప్రాంతంను సూచిస్తాయి. –ప్రధాన తపాలా కార్యాలయంతోపాటు ఉప తపాలా కార్యాలయాలకు కూడా పిన్‌కోడ్ నంబర్లను కేటాయించారు.