
దరఖాస్తులకు వేళాయే..!
ఖలీల్‌వాడి: మద్యం దుకాణాల టెండర్లు అంటేనే అదో రకమైన సందడి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి దండి ఆదాయం. 2023 డిసెంబర్ 1న ప్రారంభమైన వైన్‌షాపుల గడువు ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలో దరఖా స్తులను పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఎ కై ్సజ్ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఎకై ్సజ్ కమిషనరేట్ జిల్లాలోని వైన్స్‌షాపులకు సంబంధించిన వివరాలను సేకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టెండర్లు ఆలస్యమవుతాయని భావించినప్పటీకి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తున్నట్లు తెలిసింది. టెండర్లకు సంబంధించిన జీవోను సిద్ధం చేసినప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా అందలేదని ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలిసింది. దీనిపై వారం రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని, వచ్చిన తర్వాత దరఖాస్తులు స్వీకరణకు తేదీలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. 2023 ఆగస్టు 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి అదే నెల 22వ తేదీన లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించారు. లైసెన్సులు నవంబర్‌లో జారీ చేయగా, కొత్త దుకాణాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సైతం డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
2023లో దరఖాస్తు ఫారానికి రూ. 2 లక్షల ఫీజు వసూలు చేయగా, గతంలో 4 వేల దరఖాస్తులకు గాను ఎకై ్సజ్‌శాఖకు రూ.80కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెరిగింది. అయితే ఒక దరఖాస్తుదారు ఒక దుకాణానికి ఎన్ని దరఖాస్తులైనా వేసే అవకాశం ఉంది. ఈసారి 5 వేలకు పైగా దరఖాస్తులు అందుతాయని ఎకై ్సజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బీర్లు, వీస్కీ ధరలు పెంపు
రాష్ట్ర ప్రభుత్వం బీర్లపై రూ.30 చొప్పున, వీస్కీ క్వార్టర్‌కు రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 పెంచింది. ధరలు పెరగక ముందు మద్యం విక్రయాల ద్వారా జిల్లా ఎకై ్సజ్‌కు రూ.90 కోట్ల వరకు నెలకు ఆదాయం సమాకూరేది. ధరల పెంపుతో జూలై నెలలో రూ.111 కోట్ల ఆదాయం వచ్చింది. ధరల పెంపుతో ఎకై ్సజ్‌కు రూ. 20 కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతున్నట్లు ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలిసింది.
రిజర్వేషన్లు, శ్లాబ్‌లు..
జిల్లాలో 102 వైన్ షాపులు ఉండగా రిజర్వేషన్లు కేటాయించారు. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఈ షాపులను ఆరు శ్లాబ్‌లలో విభజించనున్నారు. 5 వేల జనాభా వరకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు, 5 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.55 లక్షలు, లక్ష జనాభా ఉంటే 60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల వరకు ఉంటే రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉంటే రూ.85 లక్షలుగా నిర్ణయించారు. లాటరీ పద్ధతి ద్వారా 24 నెలల లైసెన్స్‌కు నాలుగో వంతు ఎకై ్సజ్‌శాఖకు బ్యాంక్ గ్యారెంటీని చూపించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాల్లో ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి.
వైన్ షాపులకు నవంబర్‌తో
ముగియనున్న గడువు
జిల్లాలో 102 మద్యం దుకాణాలు
ఈ సారి రూ.3 లక్షలకు పెరగనున్న దరఖాస్తు ఫీజు
ఒక దుకాణానికి ఒకరు
ఎన్ని దరఖాస్తులైనా వేసే అవకాశం
వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
5 వేల దరఖాస్తులు అందొచ్చని
ఎకై ్సజ్ వర్గాల అంచనా