
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయాలి
ఆర్మూర్: గర్భిణులకు అవగాహన కల్పిస్తూ స్థానికంగానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయాలని కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. ఆలూరు మండలంలో కలెక్టర్ బుధ వారం ఆకస్మిక తనిఖీలు చేశారు. జెడ్పీ హై స్కూల్, పీహెచ్‌సీ, సొసైటీ గోదాం, తహసీల్ కార్యాలయాలను సందర్శించారు. ముందుగా కల్లడిలోని పీ హెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను పరిశీలించారు. గర్భిణుల వివరాలు న మోదు చేయడంతోపాటు వారికి క్రమం తప్పకుండా నిర్వహించేలా పర్యవేక్షించాలన్నారు. అనంత రం జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. సహకార సొసైటీ గోదాములో ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, స్టాక్ మిగిలి ఉన్నప్పుడే, మళ్లీ స్టాక్ తెప్పించుకోవా లని గోదాం బాధ్యులకు సూచించారు.
గ్రామంలో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యల వివరాలను పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఆలూరు తహసీల్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులపై గ్రామాల వారీగా సమీక్షించారు. అనంతరం పీహెచ్‌సీ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో ఎం.గంగాధర్, స్థానిక అధికారులు ఉన్నారు.
గర్భిణులకు క్రమం తప్పకుండా
ఆరోగ్య పరీక్షలు
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ఆలూర్ మండలంలో ఆకస్మిక తనిఖీలు
భూభారతి దరఖాస్తులపై రెవెన్యూ
అధికారులతో సమీక్ష