పెండింగ్‌లోనే.. | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌లోనే..

Aug 21 2025 8:45 AM | Updated on Aug 21 2025 8:45 AM

పెండి

పెండింగ్‌లోనే..

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
సీఎంఆర్‌ రికవరీని సీరియస్‌గా తీసుకోని అధికారులు

పండుగలు ప్రశాంతంగా..

వినాయక చవితి, మిలాద్‌–ఉన్‌–నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు.

గురువారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2025

– 8లో u

ఇన్‌చార్జి మంత్రుల ఆదేశాలు బేఖాతర్‌

గతంలో మంత్రి జూపల్లి, ప్రస్తుత మంత్రి సీతక్క

ఆదేశించినప్పటికీ ఫలితం శూన్యం

ఓ మిల్లర్‌ పోరాటంతో.. కోర్టు ఆదేశాల మేరకు

కేసు పెట్టి వదిలేశారు

సీఎంఆర్‌ ధాన్యం రికవరీలో ఉన్నతాధికారుల

అధికార దుర్వినియోగం

నిజామాబాద్‌ జిల్లాలో రూ.250 కోట్లు..

కామారెడ్డి జిల్లాలో రూ.45 కోట్ల విలువైన

సీఎంఆర్‌ పెండింగ్‌

కేసులు నమోదు చేశారు.. విచారణ వదిలేశారు..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ధాన్యం పండించడంలో, ధాన్యం సేకరణలోనూ జిల్లా నంబర్‌ వన్‌గా నిలిచింది. అదేవిధంగా సీఎంఆర్‌ రికవరీని పెండింగ్‌ పెట్టడంలోనూ మొదటి స్థానంలోనే నిలబెట్టడంపై జిల్లా యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు జిల్లా కు ఇద్దరు ఇన్‌చార్జి మంత్రులు మారారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తర్వాత జిల్లా ఇన్‌చార్జి మంత్రి గా వ్యవహరిస్తున్న సీతక్క సీఎంఆర్‌ రికవరీ విష యంలో చర్యలకు దిగాలని ఉమ్మడి జిల్లా అధికారులను ఆదేశించినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం రూ.295 కోట్ల మేర మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ రికవరీ చేయాల్సి ఉంది. ఈ విషయమై మంత్రులు సమీక్ష సమావేశాల్లో చెప్పినప్పటికీ యంత్రాంగం ఏమా త్రం సీరియస్‌గా తీసుకోకపోతుండడం విశేషం.

2014–15 నుంచి 2022–23 సంవత్సరాలకు సంబంధించి నిజామాబాద్‌ జిల్లాలో 44 మిల్లుల నుంచి రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 49 మిల్లుల నుంచి రూ.45 కోట్ల విలువజేసే సీఎంఆర్‌ రికవరీ చేయాల్సి ఉంది. ఇందులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ నుంచి రావాల్సిందే రూ.60 కోట్ల మేర ఉండడం గమనార్హం. ఇందుకు సంబంధించి గతంలో సమీక్షలో మంత్రి జూపల్లి ఉన్నతాధికారులపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లవుతున్నప్పటికీ రికవరీ చేయకుండా నోటీసులిచ్చి వదిలేయడమేమిటంటూ అసహనం వ్యక్తం చేశారు. షెడ్యూల్‌, యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకుని కేసుల మీద కేసులు పెట్టి తక్షణమే రికవరీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకుని అడ్వొకేట్‌ జనరల్‌తో కలిసి హైదరాబాద్‌లో సమీక్షకు రావాలని ఆదేశించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.

2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్లకు గాను షకీల్‌కు చెందిన రహీల్‌, రాస్‌, అమీ ర్‌, దాన్విక్‌ అనే మిల్లుల పేరిట 50 వేల మెట్రిక్‌ ట న్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ మిల్లుల్లో ఒక్క గింజ ధాన్యం కూడా మిల్లింగ్‌ చేయ లేదు. నేరుగా ధాన్యాన్ని అక్రమ మార్గంలో ముంబయి, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడు. కేవలం 5వేల మెట్రిక్‌ టన్ను ల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్‌ బి య్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇచ్చాడు. 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఏఆర్‌ ఇండ స్ట్రీ స్‌ (ఎడపల్లి), ఆర్‌కాం ఇండస్ట్రీస్‌ (వర్ని), అబ్దుల్‌ ఐ ఇండస్ట్రీస్‌ (ఎడపల్లి), ఎఫ్‌టీఎఫ్‌ ఇండస్ట్రీస్‌ (బోధ న్‌)కు ఇచ్చినట్లు చూపించాడు. ఈ నాలుగు మిల్లుల యజమానులతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలవంతంగా ధాన్యం తీసుకున్నట్లు లేఖలు ఇప్పించా డు. షకీల్‌ ఒత్తిడితోనే లేఖలు ఇచ్చినట్లు సదరు మి ల్లర్లు తెలిపారు. రూ.60 కోట్ల విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం షకీల్‌కు చెందిన మిల్లులకు రూ.10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటివరకు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ ఇవ్వకపోవడంతోపాటు, జరిమానా సైతం కట్టలేదు. నోటీసు లు ఇచ్చామని చెబుతూ అధికారులు కాలం గడిపా రు. మరోవైపు బాధితుడు కిషోర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసే కథ నడిపిన అధికారులే, సీఎంఆర్‌ సైతం కిషో రే ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం గమనార్హం. ఇన్‌చార్జి మంత్రులుగా జూపల్లి, సీతక్క ఆదేశించినప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలే దు. ఈ విషయమై అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్‌ చేయగా స్పందించలేదు.

సీఎంఆర్‌ రికవరీలో ఉన్నతాధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో గత మార్చి 30న బాధితుడి పోరాటంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న, గతంలో నిజామాబాద్‌ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌, మాజీ డీఎస్‌వో చంద్రప్రకాష్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నిఖిల్‌రాజ్‌లపై వర్ని పోలీసుస్టేషన్‌ లో కేసు నమోదు చేశారు. 2022–23 సీజన్‌లో వర్ని మండలంలోని కిషోర్‌ అనే వ్యక్తికి చెందిన శ్రీనివాస రైస్‌మిల్లుకు కేటాయించిన ధాన్యం పంపించకుండానే పంపించినట్లు చూపించిన ఉన్నతాధికారులే, సదరు రైస్‌మిల్లు యజమాని సంతకాన్ని సైతం ఫోర్జరీ చేయించడం విశేషం. ధాన్యం మాత్రం మాజీ ఎమ్మెల్యే షకీల్‌ మిల్లుకు పంపించి, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను కిషోర్‌కు చెందిన శ్రీనివాస రైస్‌ మిల్లు నుంచి ఇవ్వాలని ఈ ఉన్నతాధికారులే ఒత్తిడి తేవడం గమనార్హం. దీంతో దిక్కుతోచని బాధితుడు కిషోర్‌ నెలల తరబడి న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సద రు అధికారులను పోలీసులు ప్రశ్నించకపోవడం విశేషం. కాలయాపన చేస్తే చాలు అన్నట్లుగా యంత్రాంగం వ్యవహరిస్తోందని అధికార కాంగ్రె స్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. అధికారులకు వాటాలు ముట్టినట్లు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. అధి కారాన్ని అడ్డుపెట్టుకుని బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఇష్టం వచ్చినట్లు దందా చేశాడు. మళ్లీ అధికారంలోకి వస్తామనే అతినమ్మకంతో ధాన్యం ఇవ్వకుండానే కిషోర్‌ మిల్లు నుంచి సీఎంఆర్‌ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయించడం గమనార్హం.

పెండింగ్‌లోనే..1
1/2

పెండింగ్‌లోనే..

పెండింగ్‌లోనే..2
2/2

పెండింగ్‌లోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement