
స్థానికంలో క్లీన్ స్వీప్ చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే విధంగా పని చేయాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సూ చించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బుధవారం ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డితోపాటు నాయకులతో పీసీసీ చీఫ్ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను పూర్తిగా గెలిచేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ఆర్మూర్‌ను తన సొంత నియోజకవర్గంలాగా చూసుకుంటానన్నారు. ఏ సమస్య ఉన్నా కలిసి పరిష్కరించుకుందామన్నారు. ప్రజాసమస్యలను ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్తే తానే వెంట ఉండి పనులను చేస్తానన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోనేఇ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజ ల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌కు త్వరంలోనే సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు.
ఏ సమస్య ఉన్నా ఇన్‌చార్జి
మంత్రికి చెప్పండి
పనులు పూర్తయ్యేలా చూస్తా
ఆర్మూర్ నియోజకవర్గ సమీక్షలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్