
ఓటరు జాబితాలో గోల్‌మాల్
క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న
యూత్ కాంగ్రెస్ నాయకులు
నిజామాబాద్ సిటీ: కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఓటరు జాబితాను గోల్‌మాల్ చేసిందని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని నిరసన తెలుపుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి నెహ్రూపార్క్ నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్‌గౌడ్ మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశాలతో క్యాండిల్‌ర్యాలీ నిర్వహించామన్నారు. ఓటరు జాబితాలో అక్రమాలను రాహుల్‌గాంధీ బహిరంగపరిచిన విషయాన్ని గుర్తుచేశారు.
కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జీవీ రామకృష్ణ, నరేందర్‌గౌడ్, మఠం రేవతి, ప్రమోద్, పోల ఉష, పుప్పాల శోభ తదితులు పాల్గొన్నారు.