
సంక్షిప్తం
బడిలో వంటగది ప్రారంభం
ధర్పల్లి: మండలంలోని దుబ్బాక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన వంటగది షెడ్‌ను ప్రారంభించారు. ఏఐపీఎస్ చైర్మన్ సౌజన్య, వీడీసీ చైర్మన్ నరేష్ గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోతన్న, మాజీ ఉపసర్పంచ్ ప్రతాప్ గౌడ్, హెచ్‌ఎం చంద్రకాంత్, జీపీ సెక్రెటరీ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు
సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం గ్రామానికి చెందిన పోతుగంటి నవీన్ అనే యువకుడు మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించాడు. దాతను ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందించారు.
దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు
మోపాల్: మండలకేంద్రంలో ఇంటి స్థలం విషయంలో జరిగిన దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుస్మిత శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన బండమీది మధు తన పాత ఇల్లు కూల్చి అదే స్థలంలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈనెల 8న సాయంత్రం మధు వద్దకు గ్రామానికి చెందిన ఎల్లోల్ల రాజశేఖర్‌రెడ్డి, అతడి అన్న నరేష్‌రెడ్డి, తండ్రి ఎల్లోల్ల నారాయణరెడ్డి, తల్లి లక్ష్మీ వచ్చారు. ఈ స్థలం తమదంటూ మధు, వాళ్ల నాన్న బుచ్చన్నపై దాడి చేశారు. చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అనంతరం మధు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కుల బహిష్కరణ, బెదిరింపుపై విచారణ
మోపాల్: మండలంలోని సింగంపల్లిలో పల్లికొండ పోశెట్టిని కుల బహిష్కరణతోపాటు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో ఎస్‌ఐ సుస్మిత శుక్రవారం విచారణ చేపట్టారు. పల్లికొండ రమేష్ తమ అన్నదమ్ముళ్లపై కక్ష గట్టి కుల బహిష్కరణ చేశారని, అన్నదమ్ముళ్లను తనను చంపేందుకు రెచ్చగొడుతున్నాడని పోశెట్టి ఇటీవల పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గ్రామానికి వెళ్లిన ఎస్సై దర్యాప్తు చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్సై సుస్మిత పేర్కొన్నారు.
పీసీసీ చీఫ్‌ను కలిసిన కై సర్
నిజామాబాద్ సిటీ: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ కై సర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు.
క్యాన్సర్‌తో కానిస్టేబుల్ మృతి
ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బొంగేవారు అనిల్ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అతడు క్యాన్సర్‌తో బాధపడుతుండగా, పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. అనిల్‌కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.