
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
నగరంలోని డీసీసీబీ కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న కుంట రమేష్‌రెడ్డి
సాక్షి నెట్‌వర్క్: నిజామాబాద్ జిల్లాకేంద్రంతోపాటు అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో శుక్రవారం స్వా తంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, గ్రామాల్లో వీధివీధినా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అన్ని ప్రభుత్వ శాఖల కా ర్యాలయాలు, విద్యాసంస్థలు, వివిధ పార్టీల కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పలు సంఘాల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. విద్యాసంస్థల్లో కొందరు విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాఠశాలల యాజమాన్యాలు ఇటీవల విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం