
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
నిజామాబాద్ రూరల్: నగరంలోని దుబ్బ గుమాస్తాకాలనీలోగల దుర్గాదేవి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయ ణ అన్నారు. ఆలయ ఆవరణలో శుక్రవారం రాత్రి నూతన ఆలయ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం ని ర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌కులచారి, నుడా చైర్మన్ కేశవేణు హాజరై, నూతన కా ర్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5లక్షలు, తనవంతుగా లక్ష రూపాయలు అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
నూతన కార్యవర్గం..
దుర్గాదేవి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా అమంద్ వి జయ్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బోడికె బాబురా వు, కోశాధికారులు ధాత్రిక వేణుగోపాల్, లవంగ సదాశివ్, ఉపాధ్యక్షులుగా మాడురి కిషన్, గంగోనె సంతోష్, గంగోనె అనిల్, కార్యదర్శులుగా అమంద్ వెంకటేశ్, అమంద్ రాకేష్, కార్యవర్గ సభ్యులుగా అ జ్జన్ దుబ్బయ్య, నిచ్చంగ దానాజీ, గంగోనె ఊష న్న, గంగోనె సంతోష్, గంగోనె శ్రీనివాస్, దాత్రిక ప్రవీణ్, మహిపాల్, పొలాస రామకృష్ణ, పాండ్రవీసం హరీష్‌కుమార్, గౌరవ అధ్యక్షులుగా ఆకుల సందీప్, జోగిని మల్లేష్‌యాదవ్, గౌరవ సలహాదారులుగా భీమన్న, రాజేందర్ ఎన్నికయ్యారు.