
ఘనంగా తీజ్ వేడుకలు
డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లితండాలో శుక్రవారం తీజ్ పండుగను తండావాసులు ఘనంగా జరుపుకున్నారు. తొమ్మిది రోజులపాటు భ క్తిశ్రద్ధలతో పూజించిన గోధుమ మొలకల బు ట్టలను యువతులు నెత్తిన ధరించి, ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలు, యువతులు బంజారా సంప్రదాయ ఆటపాట లతో అలరించారు.అనంతరం గోధుమ బుట్టలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.
నిజామాబాద్ రూరల్: మండలంలోని కేశాపూర్ గ్రామ ఊర చెరువును తహసీల్దార్ అనురుద్, ఎంపీడీవో రాంనారాయణ, ఉన్నత అధికారులు శుక్రవారం పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో చెరువులను, కుంటలను లోతట్టు ప్రాంతలను పరిశీలించినట్లు వారు తెలిపారు. జిల్లాకు వచ్చే రెండు రోజులు సైతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ నాయకులు మహెంధర్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.
నిజామాబాద్ రూరల్: నగరంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కరపత్రాలను ఇ స్కాన్ కంఠేశ్వర్ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా కేంద్రం నిర్వాకులు రామానందరాయ గౌరదాస్ మాట్లాడుతూ..నగరంలోని ఆర్మూర్ రోడ్డులోగల శ్రీలక్ష్మీ కల్యాణ మండపంలో ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో శనివా రం శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మాదాసు స్వామి యాదవ్, నీతాయి చంద్ ప్ర భు, బలరాంప్రభు, రామానందగోపేస్ ప్రభు, ప్రాణప్రియ ప్రభు, సర్వానంతప్రభు ఉన్నారు.
డిచ్‌పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక సహకార సంఘాల (సొసైటీ) చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం సొసైటీ చైర్మన్లు, పాలకమండలి పదవీకాలం 6 నెలలు పొడిగించినందుకు వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసి, సత్కరించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ నల్లా చంద్రశేఖర్‌రెడ్డి, డైరక్టర ఆనంద్, సొసైటీ చైర్మన్లు చింత శ్రీనివాస్‌రెడ్డి, చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి, నాగేశ్వరరావు, నిమ్మ మోహన్‌రెడ్డి, శ్రీదర్, జన్నారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ సిటీ: నగర మున్సిపాలిటీలో ఉ త్తమ ప్రతిభ కనపరిచిన, అంకితభావం, సేవాదృక్పథంతో విధులు నిర్వహించిన పలువురు అధికారులు, సిబ్బందికి శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రశంసాపత్రా లు అందజేశారు. అనంతరం వారిని కమిషనర్ దిలీప్‌కుమార్ అభినందించారు. మున్సిపల్ డీ ఈ సుదర్శన్‌రెడ్డి, ముస్తాక్ అహ్మద్, టీపీఆర్‌వో చిదుర రమేష్‌తోపాటు పారిశుధ్య సిబ్బంది న ర్సయ్య, ఆంజనేయులు, పుష్ప, ఒడ్డెమ్మ, సైదు లు, విజయలక్ష్మి ఉన్నారు.
సౌండ్ బాక్స్ వితరణ
ధర్పల్లి: మండలంలోని దుబ్బాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు శుక్రవారం గ్రామానికి చెందిన పిప్పెర ప్రతాప్ గౌడ్, ప్రసాద్ గౌడ్, ప్రశాంత్ గౌడ్ సౌండ్ బాక్స్ సిస్టం అందజేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కవిత, వీడీసీ చైర్మన్ నరేష్ గౌడ్, హెచ్‌ఎం శశికళ ఉన్నారు.

ఘనంగా తీజ్ వేడుకలు

ఘనంగా తీజ్ వేడుకలు