ఖలీల్‌వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు రైల్వే, ఆర్‌పీఎఫ్ పోలీసులు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్సై సాయిరెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్‌కు వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. సైబర్‌మోసాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు.
కల్వర్టుల పరిశీలన
డిచ్‌పల్లి: మండలంలోని కొరట్‌పల్లి గ్రామాన్ని ఎంపీడీవో రాజ్‌వీర్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ ఇషాక్ అలీలు గురువారం సందర్శించారు. కొరట్‌పల్లి నుంచి జక్రాన్‌పల్లి మండలం కలిగోట్–చింతలూరు గ్రామాలకు వెళ్లే రోడ్డుపై ఉన్న కల్వర్టులను వారు పరిశీలించారు. ప్రజలు రాకపోకలు సాగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొరట్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నగేశ్‌కు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రేషన్‌కార్డుల పంపిణీ
నిజామాబాద్ రూరల్: సారంగాపూర్‌లోని 13వ డివిజన్‌లో కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుంచపు నాగేశ్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నూతన రేషన్‌కార్డుల మంజూరుకు కృషి చేసినందుకు రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్, రామ్‌సింగ్, రవి, శ్రీరాములు, ఇలియాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
పాకాలలో ఘనంగా తీజ్
సిరికొండ: మండలంలోని పాకాల గ్రామంతోపాటు గంగారాంనాయక్ తండాలో తీజ్ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గోధుమ మొలకల బుట్టలతో బంజారా మహిళలు పాటలు పాడుతూ సంప్రదాయ రీతిలో నృత్యాలు చేశారు. ఊరేగింపుగా వెళ్లి గోధుమ మొలకలను చెరువులో నిమజ్జనం చేశారు. తండా పెద్దలు ఆనంద్‌నాయక్, భూపతినాయక్, గంగానాయక్, రమేశ్‌నాయక్, తిరుపతినాయక్, రవినాయక్, బీమ్లానాయక్, లాల్‌సింగ్‌నాయక్, గ్రామ అధ్యక్షుడు సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సైబర్ క్రైంపై అవగాహన
సైబర్ క్రైంపై అవగాహన