
831 ఇళ్లకు ఒకేసారి ముగ్గు
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప నుల వేగవంతానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏకకాలంలో ఇందిరమ్మ ఇళ్ల పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధ, గురువారాల్లో మంచి రోజులు ఉండడంతో ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ మహామేళా చేపట్టనున్నారు.
మొదటి స్థానం కోసం..
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ సంకల్పించా రు. అందులో భాగంగా అధికారులతో సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులకు సూచనలు, సలహాలు ఇ స్తున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనివారికి మె ప్మా, డీఆర్డీవో సహకారంతో రుణాలు మంజూరు చేయిస్తున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవా రం జిల్లా వ్యాప్తంగా 831 ఇళ్లకు మార్కింగ్ చేయనుండగా, అధికంగా నిజామాబాద్ అర్బన్‌లో 133, ఆర్మూర్‌లో 47, మాక్లూర్‌లో 44, రెంజల్‌లో 41 ఇళ్లకు భూమిపూజ చేయనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకు 17,301 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అందులో 9,526 ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. వీటిలో బేస్‌మెంట్ లెవల్‌లో 5,043, రూఫ్ లెవల్‌లో 796, స్లాబ్ పూర్తయిన 256 ఇళ్లు ఉన్నాయి.
ఆ ఇళ్లపై కొనసాగుతున్న విచారణ
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గతంలో ఇళ్లు పొందిన, వాహనాలు కలిగిన 355 మంది లబ్ధిదారులను అధికారులు పక్కన పెట్టారు. కాగా, జాబితాలో కొందరు గతంలో ఇల్లు నిర్మించుకొని మధ్యలోనే నిలిపివేసిన వారు ఉన్నారు. వీరు కూడా ప్రస్తుతం లబ్ధిదారులేనని, వారికీ ఇళ్లు అందేలా చూడాలని మళ్లీ ఆదేశాలు అందాయి. దీంతో మండల పరిషత్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. మరో మూడు రోజుల్లో విచారణ పూర్తిచేసి అర్హులైన వారి జాబితాను ప్రకటించనున్నారు. దీంతో లబ్ధిదా రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
నేడు ఇందిరమ్మ ఇళ్ల
‘మార్కింగ్ మహామేళా’
జిల్లా వ్యాప్తంగా పనుల ప్రారంభం