
ఎకరానికి రూ.50 వేలు చెల్లిస్తున్నాం
గత రెండు సంవత్సరాల నుంచి కౌలు రేట్లు భారీగా పెరిగాయి. ఎకరానికి రూ.50 వేలు కౌలు చెల్లిస్తున్నాం. రెండేళ్ల క్రితం రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు చెల్లించే వాళ్లం. రెండేళ్ల నుంచి అదనంగా ఎకరానికి రూ. 10 వేలు రైతుకు చెల్లిస్తున్నాం. రెండు సంవత్సరాల కౌలు ముందుగా నే అందజేస్తున్నాం. దీనివల్ల బాగా నష్టపోవాల్సి వస్తుంది. కూనీపూర్ శివారులో 30 ఎకరాలు కౌలు చేస్తున్నాను. ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ.6 లక్షలు రెండేళ్లకు సరిపడా కౌలును అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
– పల్సర్ కృష్ణ, వెంకటేశ్వర క్యాంప్, వర్ని