
No Headline
నిజామాబాద్ రూరల్: ప్రజాకళల రక్షణకు ప్రయత్నించాలని, జానపద ప్రజా కళాకారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా సాంస్కృతిక కళావేదిక కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు సిర్ప లింగయ్య తెలిపారు. నగరంలో నాందేవ్‌వాడలోని పెన్షనర్ భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాకారులను సామాజిక మార్పులో భాగస్వాములుగా చేసేందుకు సాంస్కృతిక వేదిక కృషి చేస్తుందన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా సిర్ప లింగయ్య, అబ్దుల్, వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు, ఉపాధ్యక్షులుగా ఇందూరు సాయిబాబా, శంకర్ గౌడ్, నర్సారెడ్డి, రాధాకిషన్, విజయమాల, సహాయ కార్యదర్శిగా చంద్రకళ, రంజిత్, మధుసూదన్ గౌడ్, శ్రీనివాస్, డి.సాయిరాం తదితరులను నియమించారు.