
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడితో రాష్ట్ర
అధ్యక్షుడు రాంచందర్ రావు
సుభాష్‌నగర్: జిల్లాలో ప్రతి బూత్‌స్థాయిలో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ప్రతి బూత్‌ను బీజేపీ బూత్‌గా చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.