
No Headline
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు సోమవారం మధ్యాహ్నం నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదలను నిలిపి వేసినట్లు వరద కాలువ డిప్యూటీ ఈఈ గణేశ్ తెలిపారు. కాకతీయ కాలువకు 3 వేలు, లక్ష్మి కాలువకు 150, సరస్వతి కాలువకు 200, అలీసాగర్ లిఫ్ట్‌కు 360, గుత్ప లిఫ్ట్‌కు 135, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు నుంచి ఆవిరి రూపంలో 482 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1080.00(45 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
తగ్గిన వరద..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 35 వేల క్యూసెక్కులు వచ్చిన వరద నీరు సోమవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టింది. సాయంత్రానికి ప్రాజెక్ట్‌లోకి 13,952 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.