నలుగురికి రెండు రోజుల సాధారణ జైలు | - | Sakshi
Sakshi News home page

నలుగురికి రెండు రోజుల సాధారణ జైలు

Aug 13 2025 7:18 AM | Updated on Aug 13 2025 7:18 AM

నలుగు

నలుగురికి రెండు రోజుల సాధారణ జైలు

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలో సోమవారం డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించినట్లు ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్‌ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కౌన్సెలింగ్‌ చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. నలుగురు వ్యక్తులకు సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ గట్టు గంగాధర్‌ రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

‘డయల్‌ 100’ దుర్వినియోగంపై ఒకరికి జైలు

ధర్పల్లి: డయల్‌ 100ను దుర్వినియోగం చేసిన ఓ వ్యక్తికి కోర్టు నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్‌కు చెందిన కేతావత్‌ పరశురాం తీజ్‌ పండుగ సందర్భంగా ఇటీవల మండలంలోని డీబీ తండాలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. మద్యం సేవించి ఈ నెల 8న డయల్‌–100కు పలుమార్లు ఫోన్‌చేసి పోలీసుల విధులను దుర్వినియోగం పరిచాడు. దీంతో పోలీసులు పరశురాంపై కేసు నమోదు చేసి సోమవారం నిజామాబాద్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా జడ్జి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై కళ్యాణి తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

బాన్సువాడ: బీర్కూర్‌ మండల కేంద్రంలోని బజాన్‌ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. మృతుడి వయసు సుమారు 45 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 8712686173ను సంప్రదించాలని తెలిపారు.

సేవా సంస్థలో చోరీకి యత్నం

ఖలీల్‌వాడి: నగరంలోని గుర్బాబాది రోడ్‌ కెనాల్‌ కట్ట ప్రాంతంలో ఉన్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సోమవారం దుండగుడు చోరీకి యత్నించాడు. మధ్యాహ్న సమయంలో కార్యాలయ తాళాలు పగులగొట్టి లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. ఇందూరు యువత సిబ్బంది కార్యాలయానికి వచ్చేసరికి డోర్స్‌ తెరిచి ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి మూడో టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై ఎస్సై హరిబాబును వివరణ కోరగా చోరీయత్నం జరిగిందని, దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

ఠాణాలో చేయి కోసుకున్న యువరైతు

భూ సమస్యను పరిష్కరించాలని ఆత్మహత్యాయత్నం

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): భూ వివాదాన్ని పరిష్కరించి తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన సిద్ధిగారి యాదగిరి అనే యువరైతు సోమవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బ్లేడ్‌తో చేయికోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఎస్సై భార్గవ్‌గౌడ్‌ వెంటనే యాదగిరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో మెదక్‌ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అందుకు యాదగిరి సహకరించకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా యాదరిగి మాట్లాడుతూ తన తండ్రి రాములు గతంలో గ్రామానికి చెందిన కొందరి వద్ద సుమారు రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశాడన్నారు. ధరణి వచ్చిన తర్వాత తమ భూమి గ్రామానికి చెందిన ఇతరుల పేరిట నమోదైందని, ఈ విషయమై పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా, పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నలుగురికి రెండు రోజుల సాధారణ జైలు1
1/2

నలుగురికి రెండు రోజుల సాధారణ జైలు

నలుగురికి రెండు రోజుల సాధారణ జైలు2
2/2

నలుగురికి రెండు రోజుల సాధారణ జైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement