విద్యా బోధనకు సమయమేది..? | - | Sakshi
Sakshi News home page

విద్యా బోధనకు సమయమేది..?

Aug 13 2025 9:28 PM | Updated on Aug 13 2025 9:28 PM

విద్యా బోధనకు సమయమేది..?

విద్యా బోధనకు సమయమేది..?

ప్రభుత్వ పాఠశాలల్లోని గురువులపై బోధనేతర పనుల భారం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు పాఠాలు చెబుతూ బిజీగా ఉండే ఉపాధ్యాయులు నేడు యాప్‌, ఆన్‌లైన్‌ పనులతో కుస్తీ పడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు.

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆన్‌లైన్‌ పనులు ప్రతిబంధకంగా మారాయి. బోధనేతర పనులన్నీ ఉపాధ్యాయులు చేయాల్సి ఉండడంతో పాఠాల బోధన క్లిష్టతరంగా మారింది. మరోవైపు రాష్ట్ర విద్యాశాఖతోపాటు జిల్లా, మండల స్థాయి అధికారులు అడిగే నివేదికలు పంపేందుకు సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల వివరాలు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌లో నమోదు చేయలేదని 13 మంది హెచ్‌ఎంలకు జిల్లా విద్యాశాఖ మెమోలు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయులు మరింత ఆందోళన చెందుతున్నారు.

సగం సమయం వీటికే..

ప్రతిరోజు పాఠశాలలో ప్రార్థన నుంచే ఉపాధ్యా యులకు ఆన్‌లైన్‌ పని మొదలవుతుంది. డీఎస్‌ఈ–ఎఫ్‌ఆర్‌ఎస్‌ (డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌) ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేస్తారు. దీనికి అరగంట నుంచి గంట వరకు కేటాయించాల్సి వస్తోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో అల్పాహారం, మిగతా పాఠశాల ల్లో రాగిజావ పెట్టేందుకు మరొక గంట సమయం పడుతుంది. మొదటి రెండు పీరియడ్లు గడిచిన త ర్వాత మధ్యాహ్న భోజనానికి గంట సమయం కేటాయించాల్సి వస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో గతే డాది ప్రవేశపెట్టిన తొలిమెట్టు, ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టిన ఉన్నతి కార్యక్ర మాల నిర్వహణ, వాటి పరీక్షలకు పాఠ్యప్రణాళిక తయారీ, బోధన ఉపకరణాల ను సమకూర్చాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఎఫ్‌ఎల్‌ఎన్‌ (ఫౌండేషన్‌ లిటరసీ న్యూమరసీ), ఎల్‌ఐపీ (లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం), విద్యార్థుల వివరాలను యూడైస్‌ ప్లస్‌లో నమోదు చేయడం, కంప్యూటర్ల నిర్వహణ తదితర కార్యక్రమాలు ఉంటాయి.

ఒత్తిడిలో ఉపాధ్యాయులు

బోధనేతర పనులతో ప్రభుత్వ ఉపాధ్యాయు లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన పర్యవేక్షణ బాధ్యతలంటే జంకుతున్నారు. గతేడాది నవీపేట, రెంజల్‌, బోర్గాం(పి) పాఠశాలలకు చెందిన పలువురు ప్రధానోపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఒకవైపు మెనూ ప్రకారం మఽ ద్యాహ్న భోజనం వడ్డించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. మరోవైపు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఏజెన్సీల నిర్వాహకు లు మెనూ పాటించలేని పరిస్థితి ఏర్పడుతోంది. మంచినీటి వసతి, సరైన వంట పాత్రలు లేక చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలున్నాయి. వీటన్నింటికీ ప్రధానోపాధ్యాయులే కారణంగా చూపుతూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

బోధనేతర పనుల నుంచి తప్పించాలి

మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాల నుంచి హెచ్‌ఎంలను తప్పించాలి. వాటిని ప్రత్యేక ఏజెన్సీలకు అప్పగించాలి. ఉన్నతి కార్యక్రమాన్ని సరళీకృతం చేసి బోధనకు ఎక్కువ సమయం కేటాయించేలా హెచ్‌ఎంలకు అవకాశం ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలి. – రవీందర్‌ గౌడ్‌, పీఆర్టీయూ నాయకుడు

ఇబ్బంది లేకుండా పనిచేయాలి

టీచర్లు తమకు కేటాయించిన పనులను ఇ బ్బంది లేకుండా చేయాలి. పాఠశాలలో మిగ తా టీచర్ల సహాయం తీసుకోవాలి. సరైన ప్ర ణాళిక ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆన్‌లైన్‌ పనులు కూడా ఎక్కువ సేపు ఉండవు. – అశోక్‌, డీఈవో

బోధనేతర పనులతో

ఉపాధ్యాయులకు ఇబ్బందులు

యాప్‌, ఆన్‌లైన్‌ పనులే అధికం

అల్పాహార, మధ్యాహ్న భోజన అమలు బాధ్యతా గురువులకే..

అటకెక్కుతున్న పాఠ్యాంశాల బోధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement