
సవాల్‌గా సమస్యల పరిష్కారం
నిజామాబాద్ అర్బన్: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి అధికారులకు తలనొప్పిగా మా రింది. జిల్లాలో 453 రెవెన్యూ సదస్సులు నిర్వహించిన అధికారులు 40,468 దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యలను ఆగస్టు 14వ తేదీ లోగా పరిష్కరిస్తామని ప్రకటించగా, నేటితో గడువు ము గియనుంది. కాగా మొత్తం దరఖాస్తుల్లో సగం ద రఖాస్తులు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ఇందుకు ప్రధాన కారణం కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలే. ఉండడం గత కొన్నేళ్ల నుంచి ప రిష్కారం కానీ సమస్యలు ఉండడమే ప్రధాన కారణం. సాదా బైనామా దరఖాస్తులు 9,185 ఉండగా, ప్రభుత్వ భూముల నుంచి పట్టా భూములుగా మార్చేందుకు 9,233, ఇతర సమస్యలకు సంబంధించి 4,189 దరఖాస్తులు అందాయి. స్వీకరించిన మొత్తం స్వీకరించిన దరఖాస్తుల్లో 22,607 దరఖాస్తులను పరిష్కరించేందుకు అవకాశం ఉందని గుర్తించినప్పటికీ 1320 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు. మరో 2449 దరఖాస్తులు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదివరకే 28,072 మందికి దరఖాస్తులకు అనుగుణంగాసమస్యల పరిష్కారానికి సంబంధించి నోటీసులు అందించారు. వీటి పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోంది.
ఆ దరఖాస్తులే ఎక్కువ..
భూభారతి దరఖాస్తుల్లో ఎక్కువగా సాదాబైనామా, ప్రభుత్వ భూమి నుంచి పట్టా భూమిగా మార్పిడి, పేరు మార్పిడికి సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. వీటిని పరిశీలించి పరిష్కరించే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయికి అధికారులు వెళ్లినప్పుడు దరఖాస్తుదారు అందుబాటులో ఉండకపోవడం, సర్వే నంబర్లు ఇతరత్రా ఇబ్బందులు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులూ జాప్యానికి కారణమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి రెవెన్యూ బందాలను కూడా అధికారులు ఏర్పాటు చేయగా, దరఖాస్తుల పరిశీలనకు ఎక్కువ సమయం తీసుకోవడంతో మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం విధించిన గడువు మళ్లీ పొడిగించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం దరఖాస్తుల్లో ఇప్పటి వరకు ఇప్పటివరకు 1,320 దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేశారు.
భూభారతి దరఖాస్తులు 40468
పరిష్కారమైనవి 1320
నేటితో ముగుస్తున్న గడువు
మరింత సమయం పట్టే అవకాశం