
సింగూరు ప్రాజెక్టు గేటు ఎత్తివేత
నిజాంసాగర్: ఎగువన వర్షాలు దంచి కొట్టడంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు 11 వ నంబర్ గేటును ఎత్తి, 7,694 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ఈ నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరనుంది.
‘సాగర్’లోకి 16 వందల క్యూసెక్కులు..
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,600 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి 1,300.93 అడుగుల (5.67 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
12,769 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
బాల్కొండ:శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 12,769 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో తక్కువగా, ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
బోధన్ మున్సిపల్
కమిషనర్‌గా జాదవ్ కృష్ణ
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ మున్సిపల్ కమిషనర్‌గా జాదవ్ కృష్ణ బుధవారం రా త్రి బాధ్యతలు తీసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కమిషనర్‌గా పనిచేసిన కృష్ణ పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ తరువాత ఆరోపణలు అవాస్తవమని తేలడంతో సీడీఎంఏ ఆయనను బోధన్ మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పంద్రాగస్టు వేడుకకు ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ చైర్మన్
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హాజరవుతారని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని, వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
17న షటిల్ బ్యాడ్మింటన్
జిల్లాస్థాయి ఎంపికలు
నిజామాబాద్‌నాగారం: ఈ నెల 17న జిల్లాస్థాయి బాలబాలికల షటిల్ బాడ్మింటన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వాసు, కేవీ కిరణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–11, 13,15 విభాగంలో బాలబాలికలకు పోటీలు ఉంటాయన్నారు. మోపాల్ మండల కేంద్రంలోని ఫిట్‌నెస్ క్లబ్‌లో ఎంపికలు నిర్వహిస్తామని, వివరాలకు ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ 9848351255 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
శాలువాలు, బొకేలు వద్దు
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
సుభాష్‌నగర్: తనను కలిసేందుకు వచ్చే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని ఎంపీ అర్వింద్ ధర్మపురి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. వాటికి బదులు నోట్‌బుక్స్, పెన్నులు వంటివి తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

సింగూరు ప్రాజెక్టు గేటు ఎత్తివేత