
అగమ్య గోచరంగా జిల్లా పరిస్థితి
నిజామాబాద్ అర్బన్: జిల్లా పరిస్థితి అగమ్య గోచరంగ మారిందని, జిల్లాను పట్టించుకున్న వారే కరువయ్యారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు మంత్రి లేరని, తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఉన్నా ఆయన ఏనాడూ జిల్లా ను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి అవినీ తిని ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలును విస్మ రించారని, ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఇస్తామన్న హామీ అమలు కావడం లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వడం లేదన్నారు, క్రిస్మస్, రంజాన్ కానుకలు మర్చిపోయారని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు ప్రభాకర్, సుజిత్ సింగ్ ఠాకూర్, రాజేశ్వర్‌రెడ్డి, మస్తా ప్రభాకర్, పూజా నరేంద్ర, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అవినీతిని ప్రజలు
గమనిస్తున్నారు
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ జీవన్‌రెడ్డి