
వాగుల వైపు వెళ్లొద్దు..
ఖలీల్‌వాడి: రాబోయే రెండు, మూడు రోజు ల్లో వర్ష సూచన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ పోతరాజు సాయిచైతన్య సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీస్ అధికారు లు, సిబ్బంది ప్రతిరోజూ అందుబాటులో ఉండాలని అన్నారు. వా గుల వైపు, జలాశయాలు, చెరువులు, కుంటలు చూసేందుకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. పురాతన కట్టడాలు, ఇళ్లు, గోడలు ఉంటే వర్షతాకిడికి పడిపోయే అవకాశా లున్నాయని, ప్రజలు పునరావాస కేంద్రాల కు వెళ్లాలని సూచించారు. ఎక్కడైనా వరద ఉధృతి తలెత్తితే వెంటనే స్పందించి సహాయ క చర్యలు చేపట్టి ప్రాణనష్టం లేకుండా చూ డాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. అన్నిశాఖల అధి కారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 59700ను లేదా స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్‌ను సంప్రదించాలని సీపీ సూచించారు.