
ట్రాఫిక్ నియంత్రణ చర్యలు బలోపేతం చేయాలి
కమ్మర్‌పల్లి/ఆర్మూర్‌టౌన్/మాక్లూర్/ఖలీల్‌వాడి: ప్రజల ప్రాణాల రక్షణ కోసం ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా సరిహద్దు కమ్మర్‌పల్లి నుంచి బోధన్ వరకు 77 కిలోమీటర్ల మేర ఉన్న ఎన్‌హెచ్–63ని మంగళవారం పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఎన్‌ఐసీ, పంచాయతీరాజ్, రవాణ, 108 సర్వీస్ తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. కమ్మర్‌పల్లి మండల కేంద్ర శివారులోని పెట్రోల్ బంక్ వద్ద యాక్సిడెంట్ స్పాట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాల కారణంగా రోడ్లపై గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి మరమ్మతులు త్వరగా చేపట్టాలన్నారు. ఎన్‌హెచ్–63 పరిధిలో ఉన్న దుకాణాలు, ప్రకటనల బోర్డులు, విగ్రహాలను వెనక్కి జరిపించాలని సూ చించారు. గ్రామాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని చోట్ల జంక్షన్లు మూసి వేయడానికి బా రికేడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మూలమలుపుల వద్ద రోడ్డు విశాలంగా కనపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిని కలిపే అన్ని రకాల రోడ్లకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయా లని ఆదేశించారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
హైవేకు సమీపంలోని గ్రామాల ప్రజలకు అవగా హన కల్పించడంతోపాటు వారి సూచనలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ అధికారులు డ్రైవర్లకు తగిన సలహాలు, సూ చనలు ఇవ్వాలన్నారు. వృద్ధాప్యం, రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారికి లాంగ్ రూట్ డ్యూటీ లు వేయకుండా ఉండటమే మంచిదని సూచించారు. ఆర్మూ ర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదం ఘటన నమూనా దృశ్యాన్ని కలెక్టర్, సీపీ తిలకించి అభినందించారు. వారి వెంట ఎన్‌హెచ్ పెర్కిట్ ఈఈ మల్లారెడ్డి, మంచిర్యాల పీడీ అజయ్, డీటీవో ఉమా మహేశ్వర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఏఈ సతీశ్, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది రామకృష్ణ, ఏసీపీలు మస్తాన్ అలీ, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్, ఐఆర్‌ఏడీ మేనేజర్ శ్రీవర్ష, 108 సర్వీసెస్ ప్రతినిధి రామలింగేశ్వరరెడ్డి, ఆర్మూర్ ము న్సిపల్ కమిషనర్ రాజు, సీఐలు, ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,
సీపీ సాయిచైతన్య
జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–63పై ఉన్న
26 బ్లాక్ స్పాట్ల పరిశీలన
రోడ్ల మరమ్మతులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం