
6.5 కిలోల గంజాయి స్వాధీనం
ఖలీల్‌వాడి: నగరానికి గంజాయి తీసుకు వస్తున్న ఒకరిని పోలీసులు పట్టుకొని, అ తడి వద్ద నుంచి 6.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇ లా.. నగరంలోని అమన్ నగర్, ఖిల్లా రోడ్డులో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వెంకట్ తనిఖీలు చేపట్టారు. నగరానికి చెందిన షేక్ మిరాజ్ బైక్‌పై ఎండు గంజాయి తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా మహారాష్ట్రలోని బోకర్‌కు చెందిన ఫారుఖ్ ఖురేషి నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. అతడి వద్ద ఉన్న 6.5 కిలోల గంజాయిని, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫారుఖ్ ఖురేషీ పరారీలో ఉన్నారని, మిరాజ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎకై ్సజ్ ఎస్సై నరసింహచారి, సిబ్బంది నారాయణరెడ్డి, అవినాష్, విష్ణు, భోజన్న, శ్యామ్ తదితరులు ఉన్నారు.