
ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకు గుణపాఠం
సుభాష్‌నగర్: భారతదేశం వైపు కన్నెత్తి చూసే ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్‌తో గుణపాఠం చెప్పా మని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూ ర్యనారాయణ పేర్కొన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీచౌక్ నుంచి తిలక్ గార్డెన్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున చేసిన భారత్ మాతాకీ జై అనే నినాదాలతో ఇందూరు నగరం హోరెత్తింది. తిలక్ గార్డెన్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతలాపన కార్యక్రమంతో ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా ధన్‌పా ల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అమరుల త్యా గాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, జాతీయత, దేశభక్తిని ప్రపంచదేశాలకు చాటిచెప్పేలా ప్రధాని మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆపరేషన్ సిందూర్ వంటి చారిత్రాత్మక రక్షణ చర్యలతో భారత సైన్యం శౌర్యం, నాయక త్వం ఎంత దృఢంగా ఉందో ప్రపంచానికి చాటి చె ప్పారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కు లాచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, హర్ ఘర్ తిరంగా కో కన్వీనర్ రాంచందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
జాతీయత, దేశభక్తి, ఐక్యత
చాటిచెప్పేలా భారీ తిరంగా ర్యాలీ